జయశంకర్ భూపాలపల్లి : మేడారం సమ్మక్క సారాలమ్మలను దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయమేర్పడింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ చర్యలు చేపట్టారు. మేడారం గద్దెల వరకు వాహనాలు వెళ్లకుండా జంపన్నవాగు దాటినా తర్వాత వాహనాలను పంట పొలాల్లోకి మళ్లించారు. గద్దెల వద్ద దేవతలకు మొక్కులు చెల్లించడానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో సందడి మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment