పర్యాటకులతో ఖిల్లా కిటకిట!
ఇబ్రహీంపట్నం :
ప్రపం^è పర్యాటకుల దినోత్సవం సందర్భంగా కొండపల్లి ఖిల్లా మంగళవారం కిటకిటలాడింది. సాధారణ పర్యాటకులతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వివిధ పాఠశాలలకు చెందిన మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు ఖిల్లాను సందర్శించారు. దీంతో ఖిల్లాపై సందడి వాతావరణం నెలకొంది. విద్యార్థులు రాణిమహాల్‌లో ఉన్న ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పురాతన కట్టడాలను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. పురాతన సంపద వివరాలను ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించారు. రాష్ట్ర పురావస్తు శాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్ జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ పురాతన కాలం నాటి శిల్ప సంపద విశేషాలను మానసిక వైకల్యం కలిగిన విద్యార్థులు తెలుసుకునేందుకు ఈ పర్యటనను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం నూతన శోభను సంతరించుకోనుందని చెప్పారు. ఈ పర్యటనలో మడోన్నా హైస్కూల్, మానసిక వికాస కేంద్రం, చేయూత పాఠశాల, విజయమేరి ఇంటిగ్రేటెడ్ బ్లైండ్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ సృజన, పురావస్తు శాఖ డీఈ కోటేశ్వరరావు, ఈఈ ఉమామహేశ్వరరావు, ఏడీ దీపక్, మానసిక వికాస కేంద్రం అధ్యక్షురాలు పాలడుగు పార్వతీదేవి, సూపర్‌వైజర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.