పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్‌ రేసర్‌! | Kerala Priest Leads Double Life As Bike Racer | Sakshi
Sakshi News home page

పూజారి కమ్‌ బైక్‌ రేసర్‌.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..

Published Wed, Aug 16 2023 4:13 PM | Last Updated on Wed, Aug 16 2023 5:02 PM

Kerala Priest Leads Double Life As Bike Racer - Sakshi

ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉ‍న్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి.

వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్‌ పగలు ఆలయంలో పూజరిగా  విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్‌ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్‌ 200 మోటార్‌ బైక్‌పై రయ్‌ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్‌, బూట్లు, హెల్మెట్‌ ధరించి ఓ రైసర్‌లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ చదువుకున్న విద్యావంతుడు.

2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్‌ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్‌ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు.

2023లో మోటార్‌ సైక్లింగ్‌లో లైసెన్స్‌ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్‌ చూస్తే..అభిరుచికి లిమిట్స్‌ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ.

(చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..)


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement