Bike racer
-
పగలు పూజారి.. రాత్రిళ్లు బైక్ రేసర్!
ఒకేసారి రెండూ విభిన్న రంగాల్లో రాణించడం అందరికీ సాధ్యం కాదేమో. కొందరూ మాత్రం వాటిని అలవోకగా సాధిస్తారు. వారు ఉన్న రంగానికి ఎంచుకున్న రంగానికి చాలా తేడా ఉంటుంది. చూసే వాళ్లు సైతం ఇది నిజమా అని ఆశ్చర్యపోయాలా సమర్థవంతంగా దూసుకుపోతారు. అభిరుచిని వదులోకోవాల్సి అవసరం లేదు మనం ఎందులో ఉన్న మన కలను నిజం చేసుకోవచ్చు అని తెలియజెప్పుతారు కొందరూ వ్యక్తులు. ఆ కోవకే చెందుతారు కేరళకు చెందిన ఓ పూజారి. వివరాల్లోకెళ్తే..కేరళలో కొట్టాయం జిల్లాకు చెందిన ఉన్ని కృష్ణన్ పగలు ఆలయంలో పూజరిగా విధులు నిర్వర్తిస్తుంటాడు. అతను ఓ సాధారణ పూజరి మాత్రమే కాదు. అతనిలో ఓ రైసర్ కూడా దాగున్నాడు. రాత్రిళ్లు ఎక్స్‌పల్స్ 200 మోటార్ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతుంటాడు. అతను గ్లోవ్స్, బూట్లు, హెల్మెట్ ధరించి ఓ రైసర్లా దూసకుపోతుంటాడు. అతని గురించి తెలుసుకున్న స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు. ఉన్నికృష్ణన్న్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుకున్న విద్యావంతుడు. Temple priest at dawn, dirtbike racer by dusk.Meet Unnikrishnan (34), melshanti of Pudhukkulamgara Devi temple in Kottayam, Kerala, an avid motorcross rider who recently raced in INRC 2023 in Coimbatore. A former IT engineer, this priest-racer is training for a race in Bengaluru pic.twitter.com/9c3TJ2WtKl— Petlee Peter (@petleepeter) August 14, 2023 2013 వరకు ఐటీ రంగంలో పనిచేశాడు కూడా. ఐతే అతడి మనసు ఎప్పుడూ ఆధ్యాత్మికత వైపే వెళ్తుండటతో ఇక ఈ రంగంలోకి వచ్చేశాడు. అదీగాక 2019లో పూజారి అయిన తన తండ్రి గతించడంతో ఉన్నికృష్ణన్ తన కుటుంబ సంప్రదాయ వృత్తిని తాను కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు. డిసెంబర్ 2021లో అధికారికంగా పుదుక్కులంగర దేవి ఆలయంలో పూజారిగా బాధ్యతలు తీసుకున్నాడు. 2023లో మోటార్ సైక్లింగ్‌లో లైసెన్స్ పొందడమే గాక కోయంబత్తూరులో జరిగిన ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని రేసర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు. నిజంగా ఉన్ని కృష్ణన్ చూస్తే..అభిరుచికి లిమిట్స్ ఉండవు. మనిషిలో తగినంత సామర్థ్యం, ప్రతిభ ఉంటే ఏ ఫీల్డ్‌లో ఉన్నా గెలుపు తీరాన్ని అందుకోగలడని అవగతమవుతోంది కదూ. (చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే..) -
11 ఏళ్లకే రేసింగ్‌లో రికార్డు.. మరెన్నో విజయాలు
Shreyas Hareesh: ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఊహించారు.. సర్క్యూట్ రేసింగ్ చరిత్రకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాడని భావించారు. 13 సంవత్సరాల వయసులోనే లెక్కకు మించిన అవార్డులు, బహుమానాలు.. అతి తక్కువ కాలంలో గొప్ప రేసర్‌గా గుర్తింపు పొందిన 'శ్రేయస్ హరీష్' అందరి ఆశలకు తెరదించి కన్ను మూసాడు. నివేదికల ప్రకారం, మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ రేసింగ్ చాంపియన్‌షిప్‌లో జరిగిన ప్రమాదంలో 'శ్రేయస్ హరీష్' (Shreyas Hareesh) ప్రమాదానికి గురైనట్లు, హాస్పిటల్‌కి తరలించేలోపే కన్ను మూసినట్లు తెలుస్తోంది. దీంతో రేసింగ్ ఛాంపియన్షిప్ రద్దు చేశారు. 11 ఏళ్లకే చాంపియన్‌షిప్.. భారతదేశంలో మొట్టమొదటి మినీజీపీ చాంపియన్‌షిప్ కొట్టిన 'శ్రేయస్ హరీష్'.. తన ఐదేళ్ల ప్రాయంలోనే సైక్లింగ్‌లో మంచి నైపుణ్యం కనపరుస్తుండతో అతని తండ్రి హరీష్ పరంధామన్ ఈ రంగంలో ముందుకు వెళ్ళడానికి సహకరించారు. 11 సంవత్సరాలకే నేషనల్ ఛాంపియన్ షిప్ కైవసం చేసుకున్నారు. 2022లో పెద్ద రైడర్స్‌తో కూడా పోటీపడి రికార్డ్ కొట్టిన ఘనత శ్రేయస్ సొంతం. బెంగళూరుకు చెందిన శ్రేయాస్ ఇంటర్నేషన్ ఛాంపియన్ షిప్కి కూడా అర్హత సాధించి, అందులో కూడా మంచి ప్రతిభ కనపరిచాడు. కార్లకు ఫార్ములా వన్ రేస్ మాదిరిగానే.. 'మోటో జిపి అనేది బైకులతో నిర్వహించే రేసింగ్' దీని గురించి మన దేశంలో పెద్దగా తెలియకపోవచ్చు. రేసింగ్ బ్యాగ్రౌండ్ లేని తెలియని కుటుంబం నుంచి వచ్చిన శ్రేయస్ అతి తక్కువ కాలంలోనే దేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగాడు. ఈ ఏడాది స్పెయిన్‌లోనే ట్రైనింగ్ తీసుకుని అక్కడ జరిగే చాంపియన్‌షిప్‌లో పాల్గొనటానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అంతే కాకుండా ఇతడు ఆగస్టులో మలేషియాలోని సెపాంగ్ సర్క్యూట్లో MSBK ఛాంపియన్షిప్ 2023లో 250సీసీ విభాగంలో (గ్రూప్ B) జట్టు CRA మోటార్‌స్పోర్ట్స్‌కు కూడా ప్రాతినిధ్యం వహించాల్సి ఉంది. అంతలోనే శ్రేయస్ మృత్యువు కౌగిలి చేరిపోయాడు. -
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం.. భూమ్మీద నూకలు మిగిలే ఉన్నాయి
మోటోజీపీ రైడర్.. 31 ఏళ్ల పోల్ ఎస్పార్గారో తీవ్రంగా గాయపడ్డాడు. పోర్చుగీసు గ్రాండ్‌ప్రిక్స్‌లో భాగంగా శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ రేసులో ఎస్పార్గారో బైక్ పట్టు తప్పడంతో ఘోర ప్రమాదానికి గురయ్యాడు. కెటీఎమ్ బైక్‌తో రేసులో పాల్గొన్న ఎస్పార్గారో ల్యాప్-1 పూర్తి చేసి రెండో ల్యాప్‌ను మరికొన్ని సెకన్లలో పూర్తి చేస్తాడనగా టర్న్-10 వద్ద బైక్ పట్టు తప్పింది. అంతే బండితో పాటు రోడ్డుపై పడిపోయిన ఎస్పార్గారో దాదాపు 60 మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లాడు . దీంతో వెంటనే రెడ్ ఫ్లాగ్ చూపించి రేసును నిలిపివేశారు. 30 నిమిషాల పాటు అతనికి ప్రాథమిక చికిత్స నిర్వహించి అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతని చాతి బాగానికి, పల్మనరీ కంట్యూషన్, దవడ బాగంలో బలంగా దెబ్బలు తగిలినట్లు గుర్తించామని వైద్యులు పేర్కొన్నారు. -
రేసుకు 8 కోట్లు!
సన్నివేశం ప్రాముఖ్యతను బట్టి నిర్మాత చెక్కులో అంకెల్ని పెంచుకుంటూ పోతారు. సినిమాకు ఆ సన్నివేశం కీలకమైనప్పుడు ఖర్చుకు వెనకాడరు. తాజాగా విజయ్ దేవరకొండ నటించనున్న ‘హీరో’ సినిమా కోసం 8 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించనున్నారు. మాళవికా మోహనన్ కథానాయిక. ఇందులో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. ఫార్ములా 1 రేస్‌లో భాగంగా జరిగే సన్నివేశాల కోసం టీమ్ ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేయనుందని తెలిసింది. ఈ సీక్వెన్స్‌ను ఢిల్లీలో ఐదుగురు హాలీవుడ్ స్టంట్స్మెన్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారని తెలిసింది. 20 రోజుల పాటు ఈ రేసింగ్ సీన్స్‌ను తీస్తారట. బైక్ రేసర్‌గా కనిపించడం కోసం ప్రస్తుతం విజయ్ చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం. -
అతను బైక్ రేసరే కాదు.. చైన్ స్నాచర్ కూడా!
సికింద్రాబాద్: మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు..వాళ్ల మెడలో గొలుసులు మాయం చేయటం అతని ప్రొఫెషన్... ఆ సొత్తుతో బైక్రేస్ల్లో పాల్గొనటం అతని హాబీ..! ఈ ఘరానా నేరగాడిని బోయిన్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ ప్రాంతంలోని సింగదకుంటకు చెందిన మహ్మద్ముజీబ్ అలియాస్ గోర్ముజీబ్ అనే యువకుడికి బైక్ రేసింగ్లతోపాటు ఇతరత్రా వ్యసనాలున్నాయి. వాటి కోసం చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అసిఫ్‌నగర్, పంజగుట్ట పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన 21 చైన్‌స్నాచింగ్ కేసుల్లో ఇతడు నిందితుడు. లోగడ ముజీబ్‌ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. బెయిల్‌పై వచ్చిన నిందితుడు 12 చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఇతడు గురువారం అనూహ్యంగా పోలీసులకు చిక్కాడు. చోరీ సొత్తు 35 తులాల బంగారు గొలుసులను ఇతని నుంచి కొనుగోలు చేసిన చింతల్‌బస్తీకి చెందిన ప్రకాష్చంద్జైన్ అనే వ్యాపారిని కూడా పోలీసులు రిమాండ్ చేశారు. -
విజయం: వన్ అండ్ ఓన్లీ అలీషా
అలీషాకు చిన్నప్పటి నుంచే బైకులపై మక్కువ కలిగింది. ఆమె ఆసక్తిని చూసి సరదాగా డ్రైవింగ్ నేర్పించాడు అబ్దుల్లా. కానీ ఆమె సరదా కోసం డ్రైవింగ్ నేర్చుకోలేదని కొన్నాళ్ల తర్వాత అర్థమైంది అబ్దుల్లాకు. డాక్టర్ కూతురు డాక్టర్ కావచ్చు.. యాక్టర్ కూతురు యాక్టర్ కావచ్చు.. ఇంజినీర్ కూతురు ఇంజినీర్ కావచ్చు.. వ్యాపారవేత్త కూతురు వ్యాపార వేత్త కావచ్చు.. కానీ ఓ బైక్ రేసర్ కూతురు బైక్ రేసర్ కావచ్చా..? ఊహూ.. సమాజం ఒప్పుకోదు! అందునా భారతీయ సమాజం అస్సలు ఒప్పుకోదు! కానీ అలీషా అబ్దుల్లా.. మగ రేసర్ల మీదే కాదు, సమాజం మీద కూడా గెలిచింది. అందుకే దేశంలో ‘తొలి, ఏకైక మహిళా సూపర్ బైక్ రేసర్’గా ఆమె చరిత్రకెక్కింది. ఆడా మగా సమానమంటారు.. ఆడవాళ్లకు తిరుగులేదంటారు.. వాళ్లకేం తక్కువంటారు.. ఇలాంటి కబుర్లకు లోటేం ఉండదు. అయినా.. కొన్ని రంగాల్లో ఆడాళ్లకు అవకాశముండదు.. అలాంటి రంగాల్ని ఆడవాళ్లు ఎదుర్కొంటే అదోలా చూస్తారు.. మగరాయుడంటారు.. నీకిది అవసరమా అంటారు.. ఇలాంటి అనుమానాల్ని, అవమానాల్ని చాలానే ఎదుర్కొంది అలీషా. అయినా వెనక్కి తగ్గలేదు. చెన్నైకి చెందిన ఈ అమ్మాయి రక్తంలోనే ‘రేసింగ్’ ఉంది. అలీషా తండ్రి ఆర్ఏ అబ్దుల్లా ప్రముఖ బైక్ రేసర్, ఏడుసార్లు జాతీయ ఛాంపియన్. తండ్రి రేసుల్ని చూడటానికి వెళ్లే అలీషాకు చిన్నప్పటి నుంచే బైకులపై మక్కువ కలిగింది. ఆమె ఆసక్తిని చూసి సరదాగా డ్రైవింగ్ నేర్పించాడు అబ్దుల్లా. కానీ ఆమె సరదా కోసం డ్రైవింగ్ నేర్చుకోలేదని కొన్నాళ్ల తర్వాత అర్థమైంది అబ్దుల్లాకు. తానూ రేసర్ అవుతానని అలీషా అన్నపుడు నవ్వి ఊరుకున్న ఆయన.. ఆమె మొండి పట్టు పట్టడంతో పచ్చ జెండా ఊపారు. అప్పటిదాకా ఇండియాలో ఎక్కడా మహిళా రేసర్లను చూసిన అనుభవం అబ్దుల్లాకు కూడా లేకపోవడంతో అందరిలాగే ఆయనకూ అలీషాపై లోలోన అనుమానమే. ఐతే తొమ్మిదేళ్ల వయసులోనే గోకార్టింగ్లోకి అడుగుపెట్టింది అలీషా. రెండేళ్లకే అబ్బాయిలందరినీ వెనక్కి నెడుతూ రేసులు గెలవడం మొదలుపెట్టింది. 13 ఏళ్ల వయసులో ఎంఆర్ఎఫ్ జాతీయ గోకార్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతో ఆమె పేరు మార్మోగిపోయింది. తర్వాత తన రంగంలో తానే ప్రమోషన్ ఇచ్చుకుని ఫార్ములా కార్ రేసింగ్‌లోకి అడుగుపెట్టింది అలీషా. అక్కడా సంచలనాలే. తన ప్రతిభకు అనేక విజయాలు, పురస్కారాలు దక్కాయి. 2004లో జాతీయ ఫార్ములా కార్ రేసింగ్ ఛాంపియన్‌షిప్‌లో 25 మంది అగ్రశ్రేణి పురుష రేసర్లతో పోటీపడి ఐదో స్థానంలో నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ ఏడాది ఆమెకు బెస్ట్ నొవైస్ పురస్కారం కూడా దక్కింది. ఐతే ఫార్ములా కార్ రేసింగ్ బాగా ఖర్చుతో కూడుకున్నది కావడంతో అలీషాను అందులోంచి తప్పించి.. సూపర్ బైక్ రేసింగ్‌లోకి మార్పించారు తండ్రి అబ్దుల్లా. ఉన్నట్లుండి కార్లు వదిలి బైకులకు మారినా.. త్వరగానే సర్దుకుందామె. ఏడాదిలోనే పురుష రేసర్లకు గట్టి పోటీనిచ్చే స్థాయికి చేరింది. 2007లో ఓ రేసు మధ్యలో యాక్సిడెంట్ అయినా.. రేసు ఆపకుండా మూడో స్థానంలో నిలవడం ఆమె పట్టుదలకు నిదర్శనం. అలీషా ఎవరూ నడవని దారిని ఎంచుకుని అందులో విజయాలు సాధించినా.. మరో అమ్మాయి ఎవరూ ఆవైపు చూడట్లేదంటే.. ఆమె ఎంచుకున్న మార్గం ఎంత కఠినమైందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఆమె దేశంలో తొలి సూపర్‌బైక్ రేసరే కాదు. ఏకైక మహిళా రేసర్ కూడా. 200 కిలోలకు పైగా బరువుండే బైకును 150 కిలోమీటర్లకు పైగా వేగంతో ఓ అమ్మాయి నడపడమంటే మామూలు విషయం కాదు. అందుకు ఎంత ఫిట్నెస్ కావాలి? అందుకే రోజుకు ఆరేడు గంటల పాటు ఫిట్నెస్ కసరత్తులు చేస్తుందామె. క్రీడాకారులు సాధారణంగా ఓ స్థాయికి రాగానే చదువును వదిలేస్తారు. అందునా గంటల తరబడి సాధన చేస్తూ, రేసుల కోసం నగరాలు తిరుగుతూ ఉండే రేసర్లకు అసలే తీరిక ఉండదు. కానీ అలీషా చదువును నిర్లక్ష్యం చేయలేదు. సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాదు.. హ్యూమన్ రిసోర్స్లో పీజీ చదివింది. రేసింగ్‌లో తనకు ఎదురైన అతి పెద్ద సవాల్.. పురుషాహంకారమే అంటుంది అలీషా. ‘‘ఓ ఆడది మమ్మల్ని దాటి వెళ్లడమేంటనే అహం మగాళ్లకుంటుంది. ఏ రేసుకు వెళ్లినా పురుషులంతా ఒకవైపు. నేనో వైపు. వాళ్లంతా ఒక్కటై నన్ను వెనక్కి నెట్టాలనుకుంటారు. నీకెందుకీ రేసులని తోటి రేసర్లే నాపై కామెంట్లు చేస్తుంటారు. కానీ నేనే వేటికీ లొంగలేదు. అంతర్జాతీయ స్థాయిలో రేసులు గెలవాలని.. గొప్ప రేసర్‌గా పేరు తెచ్చుకోవాలన్నది నా లక్ష్యం’’ అని చెప్పిందామె. - ప్రకాష్ చిమ్మల