
విజయ్ దేవరకొండ
సన్నివేశం ప్రాముఖ్యతను బట్టి నిర్మాత చెక్కులో అంకెల్ని పెంచుకుంటూ పోతారు. సినిమాకు ఆ సన్నివేశం కీలకమైనప్పుడు ఖర్చుకు వెనకాడరు. తాజాగా విజయ్ దేవరకొండ నటించనున్న ‘హీరో’ సినిమా కోసం 8 కోట్లు ఖర్చు చేయనున్నారని తెలిసింది. విజయ్ దేవరకొండ హీరోగా ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో ‘హీరో’ అనే చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవిశంకర్ నిర్మించనున్నారు. మాళవికా మోహనన్ కథానాయిక. ఇందులో విజయ్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారు. ఫార్ములా 1 రేస్‌లో భాగంగా జరిగే సన్నివేశాల కోసం టీమ్ ఏకంగా ఎనిమిది కోట్లు ఖర్చు చేయనుందని తెలిసింది. ఈ సీక్వెన్స్‌ను ఢిల్లీలో ఐదుగురు హాలీవుడ్ స్టంట్స్‌మెన్ ఆధ్వర్యంలో చిత్రీకరించనున్నారని తెలిసింది. 20 రోజుల పాటు ఈ రేసింగ్ సీన్స్‌ను తీస్తారట. బైక్ రేసర్‌గా కనిపించడం కోసం ప్రస్తుతం విజయ్ చెన్నైలో శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment