మాళవికా మోహనన్, విజయ్ దేవరకొండ, శివ కొరటాల
విజయ్ దేవరకొండ హీరోగా రూపొందనున్న చిత్రం ‘హీరో’. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం జరిగింది. ఇందులో ‘పేట్టా’ ఫేమ్ మాళవికా మోహనన్ హీరోయిన్‌గా నటించనున్నారు. దర్శకుడు కొరటాల శివ హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చి, దర్శకుడు ఆనంద్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే రవికుమార్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ‘‘స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే మ్యూజికల్ థ్రిల్లర్ మూవీ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది.
దింగత్ మచాలే, ‘వెన్నెల’ కిషోర్, శరణ్ శక్తి, రాజా కృష్ణమూర్తి (కిట్టి), జాన్ ఎడతట్టిల్ ఈ సినిమాలో కీలక పాత్రలు చేయనున్నారు. ప్రదీప్‌కుమార్ సంగీతం అందించనున్న ఈ సినిమాకు మురళీ గోవింద రాజులు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా కాకుండా మైత్రీ బ్యానర్‌లో విజయ్ దేవరకొండ నటించిన ‘డియర్ కామ్రేడ్’ జూలైలో విడుదల కానుంది. అలాగే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment