సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన డియర్ కామ్రేడ్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అయితే వీకెండ్ తరువాత సినిమా పరిస్థితి ఎలా ఉండబోతుందన్న టెన్షన్‌లో ఉన్నారు చిత్రయూనిట్. అయితే తాజాగా విజయ్ దేవరకొండ హీరో నటిస్తున్న తదుపరి చిత్రం ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది.
డియర్ కామ్రేడ్ తరువాత క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో పాటు తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో సినిమాల్లో నటిస్తున్నాడు. హీరో సినిమాకు సంబంధించి ఓ భారీ షెడ్యూల్‌ను ఢిల్లీలో చిత్రకరించారు. అయితే ఈ సన్నివేశాలపై చిత్ర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం భారీ ఖర్చుతో తెరకెక్కించిన రేసింగ్ సీన్స్ ఆకట్టుకునేలా లేకపోవటంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment