
‘నా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆడినా.. ఆడకపోయినా నేను పట్టించుకోను కానీ ఆ తర్వాత ఓ నటుడిగా ప్రతీకారం తీర్చుకుంటాను’ అని అంటున్నాడు ‘అర్జున్ రెడ్డి’ స్టార్ విజయ్ దేవరకొండ. ఇటీవల విజయ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్న మేర విజయాన్ని సాధించలేకపోయాయి. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ‘నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని. హీరోగా జీవితం మొదలైన కొత్తలో.. నా సినిమాను ప్రజలు ఇష్టపడక పోయేవారు. నా స్నేహితులు సినిమాలు చూస్తూ మధ్యలో వెళ్లిపోయినా.. ఆ తర్వాత వారి అభిప్రాయాన్ని నాతో షేరు చేసుకునేవార’ని తెలిపారు.
అలాగే విజయ్ గోవాలో జరుగుతున్న ఐఎఫ్‌ఎఫ్‌ఐ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘డియర్ కామ్రేడ్ సినిమాపై ఓ చిన్న అమ్మాయి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. సినిమా విడుదలైన సమయంలో ఆ అమ్మాయి నా దగ్గరకు వచ్చి డియర్ కామ్రేడ్‌లోని మొదటి సగ భాగం మాత్రమే తనకు నచ్చిందని రెండవ భాగం నచ్చలేదని చెప్పింది. అది నిజమైన విమర్శ.. అని దానిని తాను అంగీకరిస్తాను. అయితే దానిపై నేను ఎటువంటి విమర్శ చేయను. నేను చేసే సినిమాలను ఇష్టపడతాన’ని తెలిపాడు.
సినీ పరిశ్రమల్లో రాజకీయాల గురించి విజయ్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక వ్యాపారం. ఇక్కడ డబ్బు, అధికారం ఇలా చాలా అంశాల ప్రభావం ఉంటుంది. నేను ఏదైతే అనుకున్నానో అది చేయడానికే సినిమాల్లోకి వచ్చాను. నేను సినిమా విజయవంతం అవుతుందా, లేదా అనే విషయాన్ని పట్టించుకోను. నేను కేవలం మంచి సినిమాలు మాత్రమే చెస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కువ మంది నా చిత్రాన్ని ఇష్టపడకతే.. నేను అంటే ఏంటో నా తరువాతి చిత్రంలో చూపిస్తాను’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment