సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. స్లో నేరేషన్ సినిమాకు మైనస్ అయ్యింది. అయితే ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ రీమేక్ హక్కులను తీసుకున్నట్టుగా కరణ్ జోహర్ ప్రకటించారు.
ఈ రీమేక్‌లో షాహిద్ కపూర్ నటిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే తాజాగా షాహిద్ డియర్ కామ్రేడ్‌లో నటించబోనని తేల్చి చెప్పేశారట. ఇప్పటికే అర్జున్ రెడ్డి రీమేక్‌లో నటించిన షాహిద్, డియర్ కామ్రేడ్ రీమేక్‌లోనూ నటిస్తే రొటీన్ అవుతుందన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌కు నో చెప్పినట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment