‘అప్నా టైమ్ ఆయేగా!’... గల్లీ బాయ్ సినిమా ట్యాగ్‌లైన్ ఇది. అంటే ‘మన టైమ్ కూడా వస్తుంది’ అని అర్థం. ప్రఖ్యాత ర్యాప్ సింగర్ కావాలని కలలు కంటాడు ముంబై మురికివాడల్లో నివసించే మురాద్ అనే సాధారణ గల్లీ బాయ్. మురాద్ అంటే కోరిక అని అర్థం. తను బలంగా కోరుకున్నదాని కోసం కష్టపడి శ్రమిస్తాడు. ఏదో రోజు తన టైమ్ కూడా వస్తుందని నమ్ముతాడు. తను కలలు కన్నట్టే, కోరుకున్నట్టే టైమ్ వస్తుంది. ‘గల్లీ బాయ్’ పేరుతో ఫేమస్ ర్యాపర్ అవుతాడు. ఇప్పుడు ఆ గల్లీ బా యే 92వ ఆస్కార్‌కు మన దేశం తరఫున ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగంలో ఎంపిక అయ్యాడు. ఇ
ప్పుడు ఆ గల్లీ బాయే ప్రపంచ ప్రఖ్యాత అవార్డ్ అయిన ఆస్కార్‌ను మనకు తీసుకురావాలని చాలామంది మురాద్. జోయా అక్తర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘గల్లీ బాయ్’. ఆలియా భట్ కథానాయిక. 18 పాటలున్న ఈ సినిమా ఆల్బమ్‌లో దాదాపు 7 పాటలు రణ్‌వీర్ సింగ్ పాడటం (ర్యాప్ చేయడం) విశేషం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న 92వ ఆస్కార్ అవార్డులకు రేస్ మొదలైంది. ఆస్కార్స్‌కు పంపబోయే చిత్రాలను ఎంపిక చేసే పనిలో పడ్డారు అందరూ. మన దేశం నుంచి ఈ ఏడాది ‘ఉత్తమ విదేశీ చిత్రం’ విభాగానికి పోటీపడే చిత్రానికి కోల్‌కత్తాలో ఎంపిక జరిగింది. 28 చిత్రాలు పోటీపడగా, ‘గల్లీ బాయ్’ ఫైనల్‌గా నిలిచింది. నటి, దర్శకురాలు అపర్ణా సేన్ ఆధ్వర్యంలో ఈ సెలక్షన్ జరిగింది.
పోటీపడ్డ చిత్రాలు: హిందీ చిత్రాలు ‘అంధాధూన్, ఆర్టికల్ 15, బదాయి హో, బద్లా, కేసరి, గల్లీ బాయ్, ద తస్కెన్ట్ ఫైల్స్, ఉరి : ద సర్జికల్ స్ట్రయిక్, గోదే కో జలేబీ కిలానే లే జా రియా హూ, తెలుగు చిత్రం ‘డియర్ కామ్రేడ్’ మలయాళ చిత్రాలు ‘అండ్ ది ఆస్కార్ గోస్ టూ.., ఉయిరే, ఒలు, తమిళ సినిమాలు ఒత్త సెరుప్పు సైజ్ 7, వడ చెన్నై, సూపర్ డీలక్స్, మరాఠీ చిత్రాలు బాబా, ఆనంది గోపాల్, బందీషాలా, మై గాట్ : క్రైమ్ నెం 103/2005, అస్సామీ చిత్రం బుల్ బుల్ కెన్ సింగ్, గుజరాతీ చాల్ జీవీ లాయియే, గుజరాతీ సినిమా హెల్లోరి, కురుక్షేత్ర (కన్నడ), నేపాలీ చిత్రం పహూనా: ద లిటిల్ విజిటర్స్, బెంగాలీ చిత్రాలు తరీఖ్ : ఏ టైమ్‌లైన్, కోంతో, నగర్‌కీర్తన్‌లను పరిశీలనలోకి తీసుకున్నారు. బుధవారం మొదలైన ఈ ప్రక్రియ శనివారం సాయంత్రం వరకూ సాగింది. ఈ 28 సినిమాల్లో ఆయుష్మాన్ ఖురానా నటించిన మూడు సినిమాలు (అంధాధూన్, బదాయి హో, ఆర్టికల్ 15) ఉండటం విశేషం. ఈ సంవత్సరం ఉత్తమ చిత్రంగా ‘అంధాధూన్’, ఉత్తమ నటుడిగా ఆయుష్మాన్ ఖురానా జాతీయ అవార్డుకి ఎంపిక అయ్యారు.
తెలుగు నుంచి కామ్రేడ్ ఒక్కడే
గత ఏడాది తెలుగు నుంచి ‘రంగస్థలం, మహానటి’ సినిమాలు ఉత్తమ విదేశీ చిత్రానికి ఎంపికవ్వడం కోసం పోటీ పడ్డాయి. ఈసారి తెలుగు నుంచి ‘డియర్ కామ్రేడ్’ ఒక్క సినిమానే ఈ 28 సినిమాల్లో ఉంది. విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ నిర్మించాయి.
ఆస్కార్స్‌కు గల్లీ బాయ్
Published Sun, Sep 22 2019 3:03 AM | Last Updated on Sun, Sep 22 2019 3:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment