విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డియర్ కామ్రేడ్. గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ రావటంతో చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టారు. ముఖ్యంగా సినిమా ద్వితీయార్థం బాగా స్లో అయ్యిందన్న విమర్శలు వినిపించటంతో తిరిగి ఎడిటింగ్ చేసే పనిలో పడ్డారన్న టాక్ వినిపించింది.
తాజా రష్మిక ట్వీట్ ఈ వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘డియర్ కామ్రేడ్ టీం మీకు థియేటర్లో సర్‌ప్రైజ్ ఇవ్వనుంది. అదేంటో నేను చెప్పను. మీరే చూసి తెలుసుకోండి. మీ సూచనలను పరిగణలోకి తీసుకున్నాం. ఇంతకు మించి నేనేం చెప్పలేను’ అంటూ ట్వీట్ చేశారు రష్మిక. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డియర్ కామ్రేడ్ తొలి మూడు రోజులు సెలవుల కావటంతో మంచి వసూళ్లు సాధించింది.
సోమవారం కూడా తెలంగాణలో బోనాలు సెలవు ఉండటంతో ఇక్కడ మంచి కలెక్షన్లు వచ్చినా ఆంధ్రాలో మాత్రం వసూళ్లు దారుణంగా పడిపోయినట్టుగా తెలుస్తోంది. ఈ పరిస్థితిలో చిత్రయూనిట్ చేసిన మార్పులు సినిమాను ఎంతవరకు కాపాడతాయో చూడాలి. భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించాడు.
LISTEN!!🔊 We DEAR COMRADE team have a surprise for all of you in the theatres😉 I won't let you know what exactly it is- I want you all to experience it. We've taken into consideration all your feedback and more than this I won't give you any clues. Now go go!! see see!!😉💃🏻
— Rashmika Mandanna (@iamRashmika) July 29, 2019
Comments
Please login to add a commentAdd a comment