విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ డ్రామా డియర్ కామ్రేడ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. సాగతీత సన్నివేశాలు ఎక్కువ కావటంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. చిత్రయూనిట్ దిద్దుబాటు చర్యల్లో భాగంగా రీ ఎడిట్ చేసినా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
తొలి మూడు రోజుల్లో 18 కోట్ల వసూళ్లు సాధించిన కామ్రేడ్, వీక్ డేస్‌లో డీలా పడిపోయాడు. తొలివారం ఈ సినిమా కేవలం 21 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. ఈ వారం రిలీజ్ అయిన రాక్షసుడు, గుణ 369 సినిమాలకు పాజిటివ్ టాక్ రావటంతో ఇక కామ్రేడ్ కలెక్షన్లు పుంజుకునే అవకాశం కనిపించటం లేదు.
డియర్ కామ్రేడ్ దాదాపు 34 కోట్ల బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి రావాలంటే కనీసం 34 కోట్ల వసూళ్లు సాధించాలి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తుంటే ఈ సినిమాకు భారీ నష్టాలు తప్పేలా లేవంటున్నారు విశ్లేషకులు. దాదాపు అన్ని ఏరియాల్లో కామ్రేడ్ నష్టాలనే మిగల్చనున్నాడన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment