చెర్రీ, నవీన్, యశ్, రవిశంకర్
విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా జంటగా నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డియర్ కామ్రేడ్’. నవీన్ ఎర్నేని, మోహన్ చెరుకూరి, రవి శంకర్, యశ్ రంగినేని నిర్మించారు. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రం మంచి కలెక్షన్స్‌తో ప్రదర్శింపబడుతోందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నవీన్ ఎర్నేని మాట్లాడుతూ – ‘‘బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. మొదటి మూడు రోజుల కలెక్షన్స్ 21 కోట్లు వచ్చింది. పెట్టినదానికి 80శాతం రికవరీ అయింది. గురువారంతో 100 శాతం రికవరీ అవుతుంది.
సినిమాను కొన్న అందరూ లాభాల్లో ఉంటారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాల కారణంగా ఓ 5 శాతం ఎఫెక్ట్ సినిమా మీద ఉంటుంది. ఓపెనింగ్స్ బావున్నాయి. కొంచెం స్లోగా ఉంది అనే ఫీడ్‌బ్యాక్ వచ్చింది. వెంటనే పదమూడు నిమిషాలు తగ్గించాం. క్యాంటీన్ సాంగ్ చాలా పాపులర్ అయింది. దాని రన్‌టైమ్ ఎక్కువైందని తీశాం. ఇప్పుడు కలిపాం. బుక్ మై షోలో కూడా సెకండ్ డేలా బుకింగ్స్ జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళలో కూడా మంచి రన్ ఉంది. సక్సెస్ పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాం’’ అన్నారు.
‘‘డియర్ కామ్రేడ్’ ఓ సోషల్ సబ్జెక్ట్. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. అమ్మాయిలకు పని చేసే చోట వేధింపులు ఉండటంతో పాటు ఇంట్లో ఒత్తిడి వల్ల నచ్చిన పనిని కూడా సరిగ్గా చేయలేని పరిస్థితి ఉంది. ఆ విషయాన్ని మా సినిమాలో చూపించాం. ప్రస్తుతం ‘మీటూ’ మూమెంట్ జరుగుతోంది. కరెక్ట్ టైమ్‌లో చెప్పిన కథ ఇది. కొందరు సినిమా ల్యాగ్ ఉంది అంటున్నారు. ట్రిమ్ చేసిన వెర్షన్ చూస్తే చాలా నచ్చుతుంది. ఫ్యామిలీలు, స్త్రీలు, యూత్ అందరికీ నచ్చే సినిమా ఇది.
‘అర్జున్ రెడ్డి’కి ముందు ఓకే చేసిన కథ అయినప్పటికీ కథలో మార్పులు చేయలేదు. ముందు అనుకున్నదాని కంటే పెద్ద స్కేల్‌లో తీయాల్సి వచ్చింది. విజయ్ తన ఇమేజ్‌ని పట్టించుకోడు. మంచి కథలను చెప్పాలనుకుంటాడు’’ అన్నారు యశ్ రంగినేని. ‘‘విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘హీరో’ సినిమా ఆగిపోలేదు. బైక్ రేసింగ్‌తో కూడుకున్న సినిమా కాబట్టి రేస్ ట్రాక్ మీద నచ్చిన సమయంలో షూట్ చేయడానికి వీలుపడదు. వాళ్లు అనుమతించినప్పుడే షూట్ చేయాలి’’ అన్నారు రవి శంకర్.
Comments
Please login to add a commentAdd a comment