తిరువనంతపురం : లాక్‌డౌక్ కారణంగా దేశంలోని దేవాలయాలన్నీ మూసివేయబడ్డాయి. దీంతో ఆలయాలకు వచ్చే పెద్ద ఎత్తున విరాళాలు ఆగిపోయాయి. ఈ క్రమంలోనే కేరళలోని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు పెద్ద ఎత్తున ఆదాయాన్ని కోల్పోయింది. కరోనా నేపథ్యంలో గత రెండు నెలలుగా కేరళలోని దేవస్థానాల్లో పూజలు నిలిపివేశారు. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పరిధిలో ఉన్న దేవాలయాలు మూసివేయడం మూలంగా రూ. 200 కోట్లకుపైగా నష్టపోయామని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు తెలిపారు. దీంతో దేవాలయాల పరిధిలో ఉన్న బంగారాన్ని, విరాళాలను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి వడ్డీ తీసుకోవాలని బోర్డు నిర్ణయించినట్లు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. బోర్డు తాజా నిర్ణయంపై కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ట్రావెన్‌కోర్ దేవస్థానం వారంలోపల పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. (టీటీడీ భూములు విక్రయించరాదని తీర్మానం)
Comments
Please login to add a commentAdd a comment