సాక్షి, ఢిల్లీ: దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో జమిలి ఎన్నికలు ఇప్పట్లో సాధ్యం కాదని లా కమిషన్ తేల్చి చెప్పింది. దీంతో, 2024లో జమిలి ఎన్నికలు ఉండవని తెలుస్తోంది. ప్రతీసారిలాగే ఈసారి కూడా ఎన్నికలు జరుగనున్నాయి.
అయితే, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, 2024లో లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని లా కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. దీంతో 2029 నుంచి లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీటిపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కసరత్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే.
అలాగే, జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక 2024 లోక్‌సభ ఎన్నికలలోగా ప్రచురించే అవకాశం ఉందని లా కమిషన్ చైర్మన్ జస్టిస్ రుతురాజ్ అవస్ధి ఇటీవల వెల్లడించారు. ఏకకాల ఎన్నికలపై కసరత్తు ఇంకా జరుగుతున్నందున నివేదిక పనులు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలను ఈ నివేదిక ప్రభుత్వానికి సూచిస్తుందని తెలిపారు. ఇక, జమిలి ఎన్నికలపై లోతుగా చర్చించాలని కమిషన్ సూచించింది. గత ఏడాది డిసెంబర్‌లో 22వ లా కమిషన్ జమిలి ఎన్నికల ప్రతిపాదనపై జాతీయ రాజకీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్తలు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్రశ్నలను రూపొందించింది.
On One Nation One Election, The Law Commission of India says, "The consultations with regard to the finalisation of the report on One Nation One Election would require some more meetings. We believe that certain Constitutional amendments would make the process of One Nation One…
— ANI (@ANI) September 29, 2023
ఇది కూడా చదవండి: ఇస్కాన్‌పై సంచలన ఆరోపణలు.. మేనకా గాంధీకి బిగ్ షాక్
Comments
Please login to add a commentAdd a comment