న్యూఢిల్లీ: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో మమతా బెనర్జీ నేతృత్వంలోని వెస్ట్‌బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి(కన్సెంట్) లేకుండా సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణ చేయడంపై మమత సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం(జులై 10)న విచారించింది.
రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా సీబీఐ కేసుల విచారణ చేపట్టడంపై వెస్ట్‌బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, తమ భూములను కబ్జా చేయడంతో పాటు తమను లైంగికంగా వేధిస్తున్నాడని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌కు వ్యతిరేకంగా వెస్ట్‌బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు ఉద్యమించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ షాజహాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment