consent
-
Allahabad High Court: సమ్మతి ఉన్నా, భయపెడితే అత్యాచారమే
ప్రయాగ్‌రాజ్: సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకున్నాసరే ఆ సంబంధం భయంతో కొనసాగితే అత్యాచారంగానే పరిగణించాలని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ వేసిన కేసు విచారణ సందర్భగా ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో విచారణ ఆపాలంటూ తమను ఆశ్రయించిన రాఘవ్ కుమార్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువరించింది. బాధితురాలు సివిల్ సరీ్వసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో రాఘవ్ పరిచయమయ్యాడు. ఆమెను అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి శారీరక సంబంధం పెట్టుకున్నాడు. తర్వాత పెళ్లిచేసుకుంటానని నమ్మించి బలవంతంగా ఆ బంధాన్ని కొనసాగించాడంటూ బాధితురాలు ఆగ్రా జిల్లా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు ఆగ్రా జిల్లా కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీన్ని సవాలు చేస్తూ రాఘవ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ అనీస్ కుమార్ గుప్తా సారథ్యంలోని అలహాబాద్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది. -
సీబీఐపై పోరు: ‘మమత’ సర్కారుకు సుప్రీంలో ఊరట
న్యూఢిల్లీ: సందేశ్‌ఖాలీ లైంగిక వేధింపుల కేసులో మమతా బెనర్జీ నేతృత్వంలోని వెస్ట్‌బెంగాల్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి(కన్సెంట్) లేకుండా సందేశ్‌ఖాలీ కేసులో సీబీఐ విచారణ చేయడంపై మమత సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్‌ను కోర్టు బుధవారం(జులై 10)న విచారించింది. రాష్ట్ర ప్రభుత్వ సమ్మతి లేకుండా సీబీఐ కేసుల విచారణ చేపట్టడంపై వెస్ట్‌బెంగాల్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణకు అర్హమైనదే అని సుప్రీంకోర్టు పేర్కొంది. కాగా, తమ భూములను కబ్జా చేయడంతో పాటు తమను లైంగికంగా వేధిస్తున్నాడని తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్‌కు వ్యతిరేకంగా వెస్ట్‌బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ ప్రాంత మహిళలు ఉద్యమించారు. ఈ కేసు విచారణ చేపట్టిన సీబీఐ షాజహాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. కేసు దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోంది. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్‌లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్‌కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్‌సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
శృంగారానికి సమ్మతి వయసు మార్చొద్దు
న్యూఢిల్లీ: శృంగార కార్యకలాపాల్లో పాల్గొనే విషయంలో ‘సమ్మతి వయసు’ను తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ఈ విషయంలో ఎలాంటి మార్పులు చేయొ ద్దని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసింది. లైంగిక హింస నుంచి చిన్నారులకు రక్షణ కలి్పంచేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం ప్రకారం.. శృంగారానికి సమ్మతి వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉంది. దీన్ని 16 ఏళ్లకు తగ్గించాలన్న వినతులు వచ్చాయి. లా కమిషన్ తన నివేదికను తాజాగా కేంద్రప్రభుత్వానికి సమర్పించింది. పోక్సో చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు వయసు వారంతా బాలలే. వారిపై అత్యాచారానికి, లైంగిక నేరాల కు పాల్పడితే 20 ఏళ్లకుపైగా జైలు శిక్ష విధించవచ్చు. -
రిటైల్ సంస్థలకు షాక్ ఇక ఫోన్ నెంబర్ అవసరం లేదు..!
-
ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’కి నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. ఇదీ చదవండి: Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే -
దంపతులుగా జీవిస్తుంటే... జోక్యమొద్దు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: పరస్పర అంగీకారంతో ఒక్కటిగా జీవిస్తున్న అమ్మాయి, అబ్బాయి మధ్యలోకి మూడో వ్యక్తి జోక్యం తగదని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి కుటుంబ సభ్యులు అయినా కూడా జోక్యం చేసుకోవద్దని పేర్కొంది. కుల, మతాలతో సంబంధం లేకుండా, ఒక్కటిగా బతికే జంటకు తగిన రక్షణ కల్పించాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్ రావు గేదెల అన్నారు. రక్షణ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది, అధికార యంత్రాంగానిదేనన్నారు. ఉత్తరప్రదేశ్‌లో తండ్రి అభీష్టానికి విరుద్ధంగా తనకు నచ్చిన వ్యక్తితో కలిసి ఉంటున్న ఓ యువతి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. యూపీలో తన తండ్రి చాలా పరపతి గల వ్యక్తి అని, ప్రాణభయంతో తరచూ వేర్వేరు హోటళ్లకు మారుతూ కాలం వెళ్లదీస్తున్నామని, రక్షణ కల్పించేదాకా మా దంపతులకు మనశ్శాంతి ఉండదని ఆమె కోర్టుకు నివేదించారు. -
Truecaller: ట్రూకాలర్ యూజర్లకు అలర్ట్..!
ముంబై: ట్రూకాలర్ మొబైల్ అప్లికేషన్ దేశంలోని చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించి యూజర్ డేటాను ఇతర సంస్థలో పంచుకుందని పేర్కొంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై బాంబే హైకోర్టు బుధవారం కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. శశాంక్ అనే వ్యక్తి దాఖలు చేసిన వ్యాజ్యంలో..ట్రూకాలర్ యాప్ వినియోగదారులందరి డేటాను సేకరించి, వారి అనుమతి లేకుండా ఇతర భాగస్వాములతో వినియోగదారుల డేటాను పంచుకుంటుందని పేర్కొన్నాడు. ఈ వ్యాజ్యాన్ని ఛీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ జీ ఎస్ కులకర్ణితో కూడిన బాంబే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. యూజర్ల డేటా వారికి తెలియకుండా.. యూజర్లకు వేరే యాప్ అందుబాటులో లేకపోవడంతో ట్రూకాలర్ ఆటలు సాగుతున్నాయని పేర్కొన్నాడు. ట్రూకాలర్ యూజర్ల డేటాను వారికి తెలియకుండా గూగుల్ ఇండియా, భారతి ఎయిర్ టెల్, ఐసిఐసిఐ బ్యాంక్, అనేక రుణాలు అందించే సంస్థలకు అందిస్తున్నాయని పిటిషనర్ కోర్టుకు తెలిపాడు. ఈ కేసులో కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ఐటి విభాగం, ట్రూకాలర్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పి, ఐసిఐసిఐ బ్యాంక్, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్‌ను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ పేర్కొన్నాడు. ట్రూకాలర్ యాప్ యూజర్ల అనుమతి లేకుండానే యూపిఐ సేవలను అందిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం..! ప్రభుత్వ అధికారులు ట్రూకాలర్ యాప్‌ను సరైన తనిఖీలు లేకుండా ఆమోదించారని ఆరోపించారు. ట్రూకాలర్ తన మొబైల్ అప్లికేషన్ ద్వారా పౌరుల డేటా గోప్యతను పూర్తిగా ఉల్లంఘించిందని కోర్టుకు విన్నవించాడు. అంతేకాకుంగా యాప్ డేటా రక్షణ చట్టాలను పూర్తిగా అతిక్రమిస్తోందని పేర్కొన్నాడు. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా చేర్చుతూ నోటీసులు జారీ చేసింది. నోటీసులకు మూడువారాల్లోపు సమాధానమివ్వాలని సూచించింది. -
అత్యాచారం: టీచర్ ఒత్తిడి వల్లే అలా చెప్పాను
ముంబై: బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగే శృంగారం గురించి చట్టంలో అస్పష్టంగా ఉందని తెలిపింది. ఈ మేరకు గతంలో ఈ తరహా కేసులో 19 ఏళ్ల యువకుడికి విధించిన 10 సంవత్సరాల కఠిన కారగార శిక్షను నిలిపివేస్తూ.. తీర్పు వెల్లడించింది. అంతేకాక నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. సదరు కుర్రాడు తన ఇంట్లో ఉంటున్న మైనర్ బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ.. మూడు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి. బాధితురాలైన మైనర్ బాలిక చదువుకోవడం కోసం తమకు బంధువులు అయిన నిందితుడి ఇంట్లో ఉండేది. ఈ క్రమంలో 2017 సెప్టెంబర్‌లో బాధితురాలు తన కజిన్ తనను అసభ్యకరరీతిలో తాకడాని.. అప్పటి నుంచి తనకు కడుపులో నొప్పి వస్తుందని స్నేహితురాలితో చెప్పింది. స్నేహితురాలు ఈ విషయాన్ని క్లాస్ టీచర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆమె సదరు బాలికను పిలిచి.. విషయం ఏంటని ఆరా తీయగా.. కజిన్ తనపై అత్యాచారం చేశాడని తెలిపింది. టీచర్ ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో 2018, మార్చి 3న సదరు యువకుడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇక బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించగా.. ఎలాంటి బాహ్య గాయాలు లేవని తెలిసింది. ఆ తర్వాత నిందితుడికి దిగువ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. దాంతో అతడు హై కోర్టును ఆశ్రయించాడు. బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇక దీని విచారణ సందర్భంగా కోర్టు మైనర్ బాలిక స్టేట్మెంట్ని రికార్డు చేసింది. ఈ సందర్బంగా బాలిక సంచలన విషయాలు వెల్లడించింది. తమ ఇద్దరి ఏకాభిప్రాయంతోనే లైంగిక చర్య జరిగిందని.. ఇలా నాలుగైదు సార్లు తమ మధ్య చోటు చేసుకుందని తెలిపింది. టీచర్ బలవంతం మీదనే తాను అలా చెప్పానని పేర్కొంది. సాక్ష్యాలను పరిశీలించిన జస్టిస్ షిండే.. ‘‘మైనర్ల మధ్య ఏకాభిప్రాయంతో జరిగిన శృంగారం గురించి చట్ట పరంగా అస్పష్టంగా ఉంది. మైనర్ల అనుమతిని పరిగణలోకి తీసుకోలేం. ఇక ఈ కేసులో వెల్లడైన వాస్తవాలు విలక్షణమైనవి. ఈ కేసులో బాధితురాలు, నిందితుడు ఇద్దరు ఒకే కప్పు కింద ఉంటున్నారు.. పైగా విద్యార్థులు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. బాధితురాలు తన స్టేట్మెంట్ని వెనక్కి తీసుకున్న విషయాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అతడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం. బాధితుడు దాన్ని దుర్వినియోగం చేయకూడదు’’ అని కోర్టు సూచించింది. అంతేకాక అతడికి విధించిన శిక్షను నిలుపదల చేస్తూ.. తీర్పు వెల్లడించింది. చదవండి: న్యాయాన్యాయాల విచికిత్స ‘పోక్సో’ చట్టం కింద అది నేరం కాదు -
‘ట్విట్టర్ కిల్లర్’.. పర్మిషన్ తీసుకుని చంపాడు
టోక్యో: సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని, తొమ్మిది మందిని హత్యచేసి ట్విట్టర్ కిల్లర్‌గా ప్రసిద్ధి చెందిన జపాన్ దేశస్తుడు తకాహిరొ షిరాయిషిను బుధవారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టినట్టు స్థానిక మీడియా తెలిపింది. విచారణ సమయంలో బాధితుల సమ్మతితోనే ఈ హత్యలు చేశాడని నిందితుడి తరఫు లాయర్ వాదించడం గమనార్హం. చనిపోయిన వారంతా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు అతడితో పంచుకోవడం వల్లే వారిని హత్య చేశాడని లాయర్ వాదించాడు. హత్యచేసిన తర్వాత బాధితుల శరీరాన్ని ముక్కలు చేసి, వాటిని కూల్ బాక్సుల్లో భద్రపరిచినట్టు తేలింది. అతడిపై హత్య కేసుతోపాటు అత్యాచారం కేసు నమోదయ్యింది. మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకోడానికి సిద్ధంగా ఉన్న15-26ఏళ్ల మధ్య వయస్కులను నరహంతకుడు షిరాయిషి ట్విట్టర్ ద్వారా సంప్రదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆత్మహత్య చేసుకునే విషయంలో సాయం చేస్తానని, తాను కూడా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు వారిని నమ్మబలికి హత్యలు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో దోషిగా తేలితే షిరాయిషికి ఉరిశిక్ష విధిస్తారు.(చదవండి: ‘వావ్.. చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది’) నిందితుడి తరఫు లాయర్ మాత్రం.. బాధితుల సమ్మతితోనే వారి చావుకు సహకరించాడని, అతడికి ఆరు నెలల నుంచి ఏడేళ్ల వరకు శిక్ష విధించాలని కోరాడు. అయితే అధికారులు మాత్రం ఈ వాదనలు సరైనవి కాదని, ఎటువంటి అనుమతి తీసుకోకుండానే హత్యలు చేశాడని వెల్లడించారు. బాధితుల తల వెనుక భాగంలో గాయాలు ఉన్నాయి... అంటే దీని అర్థం సమ్మతి లేదని, వారు ప్రతిఘటించారని అన్నారు. మూడేళ్ల క్రితం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావిస్తున్నట్టు ట్వీట్ చేసిన ఓ 23 ఏళ్ల మహిళ కనిపించకుండా పోవడంతో షిరాయిషి హత్యలు బయటపడ్డాయి. సదరు మహిళ కనిపించకుండా పోయిన తర్వాత బాధితురాలి సోదరుడికి అనుమానం వచ్చి ఆమె ట్విట్టర్ ఖాతాను తెరవగా విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపట్టారు. షిరాయిషీతో ఆమె తరుచూ ట్విట్టర్లో సంప్రదించినట్టు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. (చదవండి: ట్విట్టర్‌కు గట్టి మనిషి) విచారణలో నిందితుడి ఇంటి కింది భాగంలో ఓ రహస్య గదిని బయటపడగా.. అందులో 9 మృతదేహాలను గుర్తించారు. అందులో ముక్కలుగా చేసిన శరీర భాగాలు, 240 ఎముకలను బాక్సుల్లో దాచి ఉంచాడు. ప్రపంచంలోని పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన ఏడు దేశాల్లో జపాన్‌లోనే అధికంగా ఏడాదికి 20వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. -
ట్విటర్ కూడా అమ్మేసిందట!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్ డేటా బ్రీచ్ ఆందోళన యూజర్లను ఇంకా వీడకముందే..తాజాగా మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్‌కూడా యూజర్ల డేటాను విక్రయిచిందన్న వార్తలు మరింత కలవరం పుట్టించాయి. ట్విటర్‌కు చెందిన యూజర్ డేటా కేంబ్రిడ్జ్ ఎనలిటికా చేజిక్కించుకుంది. అనంతరం ఈ సమాచారాన్ని వినియోగదారుల సమ్మతి లేకుండానే పొలిటికల్ కన్సల్టింగ్ సంస్థకు విక్రయించింది. గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జిఎస్ఆర్, అలెగ్జాండర్ కోగన్ సొంత వ్యాపార సంస్థ) భారీ ఎత్తున తమ వినియోగదారుల డేటాను తస్కరించిందని ట్విటర్ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. 2015లో కేవలం ఒక రోజులోనే నెలరోజులకు సంబంధించిన భారీ డేటాను చోరిచేసిందని పేర్కొంది. బ్లూంబర్గ్ అందించిన సమాచారం ప్రకారం 2015లో, జీఎస్ఆర్ సంస్థకు డిసెంబరు 2014 నుంచి ఏప్రిల్ 2015 దాకా పబ్లిక్ ట్వీట్ల రాండం శాంపిల్‌కోసం ఐదు నెలల వ్యవధిలో తన అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్‌పై వన్‌టైం యాక్సెస్ ఇచ్చామని ట్విటర్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా నేడేటా లీక్ అయ్యిందని గుర్తించినట్టు వివరించింది.అయితే ఇటీవల డేటా బ్రీచ్ నివేదిక నేపథ్యంలో అంతర్గత సమీక్షలో ఈ విషయాన్ని గుర్తించామనీ, దీంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా, దాని అనుబంధ సంస్థలు, ప్రకటనకర్తలను తొలగించినట్టు పేర్కొంది. కాగా యూజర్ల సమాచార భద్రతలో ట్విట్టర్ వైఫల్యం, డేటా దుర్వినియోగాన్ని నిరోధించడంలో విఫలమైనందుకు మరోసారి తీవ్ర దుమారం రేగింది. -
మెటల్ ఎక్స్ ప్రతిపాదనకు హిందాల్కో ఓకే
5 శాతం పెరిగిన హిందాల్కో షేర్ న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్‌కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిస్టైన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్‌కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు. మెటల్స్ ఎక్స్ ఆఫర్‌ను అంగీకారం తెలపనున్నామని ప్రకటించడంతో హిందాల్కో షేర్ బీఎస్ఈలో 5 శాతం ఎగసి రూ.103 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 13.3 లక్షలు, ఎన్ఎస్ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి. -
సమ్మతితో శృంగారంలో పాల్గొంటే.. చర్యలొద్దు!
న్యూఢిల్లీ: సెక్స్ వర్కర్లు సమ్మతితో శృంగారంలో పాల్గొన్నప్పుడు పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు నియమించిన ఓ ప్యానెల్ సూచించింది. వేశ్యల హక్కుల పరిరక్షణకు, వారికి మెరుగైన పనితీరు వాతావరణం కల్పించడానికి 2011లో ఏర్పాటైన ఈ ప్యానెల్ వచ్చే నెలలో తన నివేదిక సమర్పించనుంది. వేశ్యవృత్తి ఒకరకంగా చట్టబద్ధమే అయినా కొన్ని చట్టాల వల్ల రెడ్‌లైట్ జిల్లాల్లో సెక్స్ వర్కర్లు పోలీసుల చర్యలకు బలవుతున్నారని ప్యానెల్ అభిప్రాయపడింది. 'స్వచ్ఛంద సెక్స్ వర్క్ అక్రమం కాదు కానీ, బ్రోతల్ హౌస్ నిర్వహించడం చట్టవ్యతిరేకం. ఈ నేపథ్యంలో బ్రోతల్ హౌస్‌లపై పోలీసులు దాడి చేసినప్పుడు సెక్స్ వర్కర్లను అరెస్టు చేయడంగానీ, జరిమానా విధించడంగానీ, వేధించడంగానీ చేయరాదు' అని ప్యానెల్ పేర్కొంది. అక్రమ మానవ రవాణా చట్టం (ఐటీపీఏ) 1956లోని సెక్షన్ 8లోని లైంగికంగా లోబర్చుకోవడం అనే పదాల్ని తొలగించాలని, దీనిని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా దుర్వినియోగపరుస్తున్నాయని ప్యానెల్ అభిప్రాయపడింది. ఈ సెక్షన్ ప్రకారం వ్యభిచారం కోసం ప్రలోభపెడితే ప్రస్తుతం ఆరు నెలల జైలుశిక్ష, రూ. 500 జరిమానా విధిస్తున్నారు. అక్రమ మానవ రవాణాను అరికట్టే విషయంలో పోలీసులు కొన్నిసార్లు హద్దు మీరుతున్నారు. ఉమ్మడి సమ్మతితో వ్యభిచారంలో పాల్గొన్నా.. సెక్స్ వర్కర్లపై, విటులపై చర్యలు తీసుకుంటున్నారని సీనియర్ న్యాయవాది ప్రదీప్ ఘోష్ నేతృత్వంలోని ప్యానెల్ అభిప్రాయపడింది. -
అవివాహిత తల్లికి ‘సుప్రీం’ బాసట
తండ్రి హక్కుల కన్నా బిడ్డ సంక్షేమం ముఖ్యమని స్పష్టీకరణ న్యూఢిల్లీ: తన బిడ్డ తండ్రి పేరు వెల్లడించకుండా.. తనను ఆ బిడ్డ సంరక్షకురాలిగా గుర్తించాలంటూ న్యాయపోరాటం చేస్తున్న ఓ అవివాహిత తల్లికి సుప్రీంకోర్టు బాసటగా నిలిచింది. ఆ బిడ్డ సంరక్షణ విషయంలో తండ్రికి నోటీసులు జారీ చేయకుండా, అతడి వాదనలు వినకుండా.. ఏకపక్షంగా తల్లిని సంరక్షుకురాలిగా గుర్తించటం సాధ్యం కాదన్న విచారణ కోర్టును.. ఆమె వినతిపై పునఃనిర్ణయించాలని నిర్దేశించింది. తన బిడ్డకు తనను ఏకైక సంరక్షకురాలిగా.. తన లావాదేవీలన్నిటికీ తన బిడ్డను నామినీగా గుర్తించాలని ఒక అవివాహిత తల్లి చేసిన విజ్ఞప్తిని విచారణ కోర్టు, ఆ తర్వాత హైకోర్టు తిరస్కరించగా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ అంశాన్ని విచారించిన జస్టిస్ విక్రమ్‌జిత్‌సేన్, జస్టిస్ అభయ్‌మనోహర్ సాప్రేలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీచేసింది. అవివాహిత తల్లులు, ఒంటరి తల్లుల బిడ్డల విషయంలో.. ఆ బిడ్డకు సంబంధించి బాధ్యతలను విస్మరించిన తండ్రుల చట్టబద్ధమైన హక్కులకన్నా.. ఆ బిడ్డ సంక్షేమానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. తన కడుపున బిడ్డకు జనన ధ్రువీకరణ పత్రం కోసం అవివాహిత లేదా ఒంటరి తల్లులు దరఖాస్తు చేసుకున్నపుడు.. ఆ ధ్రువీకరణ పత్రాలు జారీచేయటానికి ఆయా తల్లుల ప్రమాణపత్రం(అఫిడవిట్) సరిపోతుందని సంబంధిత అధికారులకు ఆదేశించింది.