మెటల్ ఎక్స్ ప్రతిపాదనకు హిందాల్కో ఓకే | Hindalco accepts 'sweetened' Metals X bid for ABML | Sakshi
Sakshi News home page

మెటల్ ఎక్స్ ప్రతిపాదనకు హిందాల్కో ఓకే

Published Wed, Apr 27 2016 1:14 AM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

Hindalco accepts 'sweetened' Metals X bid for ABML

5 శాతం పెరిగిన హిందాల్కో షేర్
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా గనుల కంపెనీ మెటల్ ఎక్స్ టేకోవర్ ఆఫర్‌కు హిందాల్కో సమ్మతి తెలియజేయనున్నది. హిందాల్కో అనుబంధ కంపెనీ, ఆస్ట్రేలియాలో లిస్టైన ఆదిత్య బిర్లా మినరల్స్(ఏబీఎంఎల్)ను మెటల్ ఎక్స్ కంపెనీ టేకోవర్ చేయనున్నది. ఈ టేకోవర్ ఆఫర్‌లో భాగంగా 4.5 ఏబీఎంఎల్ షేర్లకు ఒక మెటల్స్ ఎక్స్ షేర్‌ను కేటాయిస్తారు. అంతేకాకుండా ఒక్కో ఏబీఎంఎల్ షేర్‌కు 0.08 డాలర్(ఆస్ట్రేలియా) నగదు చెల్లిస్తారు.  మెటల్స్ ఎక్స్ ఆఫర్‌ను అంగీకారం తెలపనున్నామని ప్రకటించడంతో హిందాల్కో షేర్ బీఎస్‌ఈలో 5 శాతం ఎగసి రూ.103 వద్ద ముగిసింది. బీఎస్‌ఈలో 13.3 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో కోటికి పైగా షేర్లు ట్రేడయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement