తిరుపతిలో ప్రభుత్వ బాలికల వసతి గృహంలో దారుణం చోటుచేసుకుంది. బాలికల వసతి గృహంలో వార్డెన్ నందగోపాల్ హస్టల్ విద్వార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. అతన్ని అరెస్ట్ చేశారు. పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి.. 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ ఈ నెల 23న వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.