సాక్షి, హైదరాబాద్ : మరదలిని(మైనర్) బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు ఓ బావ. ఈ ఘటన ఆదివారం నగరంలోని వినాయకనగర్‌లో వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని నేరేడ్‌మెట్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు చెప్పిన వివరాల మేరకు.. వినాయకనగర్‌కు చెందిన తుపాకుల రమేష్(32) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓల్డ్ సఫిల్ గూడకు చెందిన కరుణశ్రీని వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కరుణశ్రీకి పదహారేళ్ల సోదరి ఉంది. ఆ యువతిపై రమేష్ కన్నేశాడు.
తల్లిదండ్రులు లేని సమయంలో రమేష్ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. అంతేకాక ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని ఆ యువతిని మభ్యపెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించింది. గత మార్చి నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆమెపై కొన్నిసార్లు లైంగిక దాడి చేశాడు. భార్యకు నీ చెల్లెల్నీ పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అందుకు ఆమె రమేష్‌ను మందలించి వదిలేసింది.
ఈ క్రమంలో గత నెల (మే) 25న బాలికను బలవంతంగా యాదగిరి గుట్టకు తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ యువతిని రమేష్ తిరుపతి తీసుకెళ్లాడు. మే నెల 31న తల్లిదండ్రుల ఇంటి వద్ద ఆమెను వదిలి వెళ్లిపోయాడు. జరిగిన విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్కో చట్టం కింద నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment