![Man Allegedly Raped A Baby Girl After Her Mother Rejected His Proposal - Sakshi](/styles/webp/s3/article_images/2018/10/1/Crime_against_women.jpeg.webp?itok=uA0cSffu)
ప్రతీకాత్మకచిత్రం
భోపాల్ : తన కోర్కెను తీర్చేందుకు నిరాకరించిందనే కోపంతో మహిళ కుమార్తె ఏడాది పసికందుపై ఓ వ్యక్తి లైంగిక దాడికి తెగబడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. మహిళ పెద్దకుమార్తె ఫిర్యాదు చేయడంతో ఈ దిగ్భ్రాంతికర ఘటన వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబానికి బంధువైన నిందితుడు కొద్దిరోజులుగా మహిళను లోబరుచుకునేందుకు యత్నిస్తుండగా ఆమె తిరస్కరించింది. లైంగిక దాడికి తెగబడేందుకు బాధితురాలి ఇంటికి వెళ్లగా ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో ఆమె ఏడాది కుమార్తెపై దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అదే రాత్రి మరోసారి బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె నాలుగేళ్ల కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు.
నిందితుడిపై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ ఏడాది మే 21న మధ్యప్రదేశ్‌లోని రెహ్లిలో తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి ఘటన జరిగిన 46 రోజుల్లోగా మరణ శిక్ష విధించారు. ఘటన జరిగిన 72 గంటల్లోనే నిందితుడిని పట్టుకుని సెషన్స్ కోర్టు ఎదుట హాజరుపరిచారు. లైంగిక దాడి జరిగిందని డీఎన్‌ఏ నివేదికలో తేలడంతో నిందితుడుని దోషిగా తేల్చిన న్యాయస్ధానం మరణ శిక్ష విధించింది.
Comments
Please login to add a commentAdd a comment