
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కెలమంగలం(కర్ణాటక): అంచెట్టి తాలూకా తగ్గట్టి సమీపంలోని బేడరహళ్లి గ్రామానికి చెందిన కేశవన్ (21) అదే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల ప్లస్‌టూ విద్యార్థినిని పెళ్లి చేసుకొంటానని ఆశచూపి పలు మార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో విద్యార్థిని గర్భం దాల్చింది. విషయం తెలుసుకొన్న కేశవన్ ఆమెను అబార్షన్ కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఈ విషయాన్ని తెలుసుకొన్న విద్యార్థిని తల్లితండ్రులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేశవన్‌ను అరెస్ట్ చేశారు. అతనికి సహకరించిన అళగేశన్(28), పచ్చముత్తు(25), ఆనంద్(28), పచ్చప్ప(32), క్రిష్ణన్(30), వాసన్, మాదప్పన్‌లతోపాటు 8 మందిపై పోక్సో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment