
బరేలి : ఉత్తర ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన అథ్లెటిక్ కోచ్‌పై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మీరాగంజ్‌లో ఓ టోర్నమెంట్ సందర్భంగా కోచ్ ఆలం తనను లైంగిక వేధింపులకు గురిచేశారని, లైంగిక దాడికి యత్నించగా తాను ప్రతిఘటించానని మహిళా అథ్లెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు గతనెలలో నైనిటాల్‌లో జరిగిన మాన్‌సూన్ మారథాన్ సమయంలో ఆలం తనపై లైంగిక దాడికి యత్నించాడని మరో మైనర్ అథ్లెట్ ఫిర్యాదు చేశారు. తొలుత బాలికకు అభ్యంతరకర చిత్రాలు చూపి ఆపై లైంగిక దాడికి యత్నించాడు. నైనిటాల్ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఈ విషయాన్ని బాధితురాలు తల్లితండ్రులకు వివరించగా, బాధిత బాలికలిద్దరూ తల్లితండ్రల సూచన మేరకు కోచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కీచక కోచ్‌పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేశామని, నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment