మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌! | The Teacher Grabbing The Girl And Then Forcibly Smearing Cake, Booked Under POCSO | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్‌!

Published Sun, Sep 12 2021 6:20 PM | Last Updated on Mon, Sep 20 2021 11:58 AM

The Teacher Grabbing The Girl And Then Forcibly Smearing Cake, Booked Under POCSO - Sakshi

న్యూఢిల్లీ: గురువులే కీచకలుగా మారి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలను ఎన్నో మనం చూశాం. ప్రస్తుతం ఇదే తరహలో ఒక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్లితే...రాంపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న అలోక్‌ సక్సేనాను అనే ఉపాధ్యాయుడు సివిల్‌ లైన్‌ ప్రాంతంలో కోచింగ్‌ సెంటర్‌ను నడుపుతున్నాడు. ఈక్రమంలో ఆ ఉపాధ్యాయుడు తన కూతురు ముఖంపై కేకు పూసి అసభ్యకరంగా ప్రవర్తించడంటూ... ఓ మైనర్‌ బాలిక తండ్రి అతని పై కేసు పెట్టారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

ఈ మేరకు నిందితుడిని విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం పోలీసులు గుర్తించారు. ఈ వీడియోలో "నిన్ను ఇప్పుడు ఎవరూ కాపాడతారు"..అంటూ  నిందితుడు మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తోంది. ఈ ఘటన ఉపాధ్యాయ దినోత్సవం రోజు జరగడం విచారకరం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement