ఎవరి కిస్‌లో కిక్కు..! | whose kick in kiss...? | Sakshi
Sakshi News home page

ఎవరి కిస్‌లో కిక్కు..!

Published Thu, Sep 4 2014 12:35 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

ఎవరి కిస్‌లో కిక్కు..! - Sakshi

ఎవరి కిస్‌లో కిక్కు..!

 ముద్దంటే చేదా... ఆ ఉద్దేశం లేదా... అంటూ దాని కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారే ఎక్కువ. కానీ...
 కిస్‌ల్లోనూ కొలవూనాలుంటాయుని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పదం చిన్నదే అయినా... సబ్జెక్టు పెద్దదంటున్నారు రసిక ప్రియులు. బాలీవుడ్ భామలు సన్నీ లియోన్... ఆలియూభట్‌ల్లో ఎవరి ముద్దులో కిక్కెక్కువన్నది ఇప్పుడు వారి ప్రశ్న. బిగ్‌స్క్రీన్‌పై కిస్‌ల పంట పండించినవారిలో టాప్ వీళ్లే. ఓ సినివూలో అర్జున్ కపూర్‌కు లిప్ కిస్ ఇచ్చి ఆలియూ.. సహ నటి సంధ్యా
 మదుల్ పెదాలు కొరికి సన్నీ సంచలనం రేపారు. ఇక టాప్ ఎవరనే చాయిస్ మీదే..!
 
బ్యాక్ టు పెవిలియన్..!
సక్సెస్‌నిచ్చిన సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్‌లో పిల్లిమొగ్గలేసిన ఆసిన్‌కు ఇప్పటికి జ్ఞానోదయుమైనట్టుంది. అక్కడ తన సినివూలన్నీ బాక్సాఫీసుల్లో బోల్తా పడటంతో పెట్టేబేడా సర్దుకొని మళ్లీ దక్షిణాదికి వస్తోందట. త్వరలోనే ఇక్కడ ఓ సినివూ చేయబోతోందని ఆమె సోషల్ నెట్‌వర్క్ పేజీలో పోస్టింగ్ సారాంశం. ఏదిఏమైనా సౌత్‌లో బేస్ క్యాంప్ ఎత్తేసి ముంబైకి షిఫ్ట్ అయిన ఈ అమ్మడికి... సౌత్‌పై ప్రేమ కంటే అక్కడి ఫ్లాప్‌ల ఎఫెక్టే ఎక్కువనేది ఇక్కడి సినీజనుల టాక్.
 
డేటింగ్‌లో అప్‌డేట్..!
డేటింగ్‌లో కూడా ‘అప్‌డేట్’ ఉంటేనే మజా అంటోంది పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్. బాయ్ ఫ్రెండ్ డేవిడ్ లుకాడో తనను చీట్ చేశాడని తొలిసారి ప్రకటించిందీ భావు. ‘నా ప్రియుడు నన్ను మోసగించాడని మీకు తెలుసని నాకు తెలుసు’ అంటూ లాస్‌వెగాస్‌లో ఓ షో సందర్భంగా గోడు వెళ్లబోసుకుంది. ‘అయితే నాకు దీని వల్ల వుంచే జరిగింది. ఇప్పుడు సాధ్యమైనన్ని ఫస్ట్ డేట్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నా’ అంటూ అసలు విషయుం చెప్పేసిందీ స్వీటీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement