pavilion
-
ఏపీ పెవిలియన్‌కు విశేష ఆదరణ
సాక్షి, అమరావతి: ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్–2023లో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌కు సందర్శకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ‘వసుధైక కుటుంబం–యునైటెడ్ బై ఇండియా’ పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ నిర్వహిస్తున్నారు. నవంబర్ 14న ప్రారంభమైన ఎగ్జిబిషన్ నవంబర్ 27వ తేదీతో ముగియనుంది. రాష్ట్రం నుంచి 195 దేశాలకు 3,137 ఉత్పత్తులను ఎగుమతి చేయడం ద్వారా ఆయా దేశాలతో కుటుంబ సభ్యులుగా మారి వసుధైక కుటుంబంగా ఎలా ఎదిగిందన్న విషయాన్ని తెలియచేసే విధంగా ఏపీ పెవిలియన్‌ను తీర్చిదిద్దారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎగ్జిబిషన్లో 550 చదరపు మీటర్ల విస్తీర్ణంలో సందర్శకులను కట్టిపడేసే విధంగా ఏపీ పెవిలియన్ తీర్చిదిద్దింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ ఈ పెవిలియన్‌ను ప్రారంభించారు. భారీగా సందర్శకుల తాకిడి రాష్ట్రంలోని హస్తకళలు, భౌగోళిక గుర్తింపు పొందిన వస్తువులతో పాటు హస్తకళా ఉత్పత్తులతో ఏపీ పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన స్టాల్స్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా సందర్శకుల తాకిడి అధికంగా ఉందని, ప్రతిరోజు లక్ష మందికిపైగా సందర్శకులు పెవిలియన్‌ను సందర్శిస్తున్నారని పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ (ఎగుమతులు) జీఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. కలంకారీ, మంగళగిరి జరీ, ధర్మవరం పట్టు, నెల్లూరు ఉడెన్ కట్లరీ, లేపాక్షి, తోలు బొమ్మలు వంటి వాటికి సందర్శకుల నుంచి మంచి స్పందన వచ్చిదని, పలువురు భారీగా కొనుగోళ్ల ఆర్డర్లు ఇచ్చారని వివరించారు. నాలుగున్నర ఏళ్లుగా ఏపీలో నాడు–నేడు కింద అమలు చేస్తున్న పథకాలను ప్రతీ ఒక్కరికి అర్థమయ్యే విధంగా ఇంగ్లిష్ లో వివరిస్తూ ఆర్ట్ రూపంలో ఏర్పాటు చేసిన చిత్రానికి మంచి స్పందన వచ్చిదని, పలువురు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని కొనియాడారని చెప్పారు. అధికారులకు అభినందన పెవిలియన్‌లో రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరిస్తూ వైఎస్సార్ ఏపీ వన్ కింద ఏవిధంగా త్వరతగతిన అనుమతులు జారీ చేస్తున్నారో తెలియజేసే కియోస్్కని పలువురు సందర్శించారు. 974 కి.మీ. తీర ప్రాంతాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తున్నదీ, మత్స్య ఎగుమతుల్లో ఏపీ నంబర్–1 స్థానంలో ఉందన్న విషయాన్ని వివరిస్తూ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద పలువురు ఫొటోలు దిగుతున్నారు. సాయంత్రం వేళ రాష్ట్రంలోని సంప్రదాయ కళలను పరిచయం చేసేవిధంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కళా ప్రదర్శనలకు విశేష స్పందన లభించింది. రాష్ట్ర ప్రగతిని ప్రపంచ దేశాలకు తెలియచేసే విధంగా పెవిలియన్‌ను తీర్చిదిద్దారంటూ పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ అధికారులను ప్రశంసించారు. కాగా.. సందర్శకులను విశేషంగా ఆకర్షించిన ఏపీ పెవిలియన్‌కి ఐఐటీఎఫ్ జ్యూరీ అవార్డు ప్రకటించింది. -
ఐఐటీఎఫ్లో ప్రత్యేక ఆకర్షణగా ఏపీ స్టాల్స్
ఢిల్లీ: పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌లో పూర్తి అనుకూల వాతావరణం ఉందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఢిల్లీలో భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన(ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్)లో ఏపీ పెవిలియన్‌ను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, తయారయ్యే వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు.పెవిలియన్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు , జగనన్న కాలనీల నమూనాల ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఏపీలో మూడు ఇండస్ట్రియల్ కారిడార్లు ఉన్నాయని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. 45వేల ఎకరాల భూమి పరిశ్రమలకు అందుబాటులో ఉందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో లక్షన్నర కోట్ల పెట్టుబడులు వచ్చాయని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందని తెలిపారు. ఏపీలో పరిశ్రమల గ్రోత్ రేటు 11.43తో అందరి కంటే ముందుందని వెల్లడించారు. ఎగుమతులలో ఏపీ ఆరో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఇదీ చదవండి: దయాకర్ గెలిస్తే రైతు బంధు రూ. 16వేలు.. పాలకుర్తి బీఆర్ఎస్ సభలో కేసీఆర్ -
ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను ప్రారంభించిన ఆర్థిక మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, వాణిజ్య శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ పెవిలియన్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ లాంఛనంగా ప్రారంభించారు. 41వ భారత అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన -2022లో భాగంగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ పెవిలియన్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. "వోకల్ ఫర్ లోకల్ - లోకల్ టు గ్లోబల్" నేపథ్యంతో తీర్చిదిద్దిన పెవిలియన్ ను ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కలిసి ప్రారంభించారు. ఈనెల 27 వరకు సాగనున్న ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ లో ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, సంప్రదాయాలు, పర్యాటక ప్రత్యేకతను ప్రతిబింబించే భౌగోళిక గుర్తింపు కలిగిన 20 రకాల ఏటికొప్పాక, మ్యాంగో జెల్లి, క్రిస్టల్ సంచులు, లెదర్ ఉత్పత్తులను పెవిలియన్ లో ఉంచారు. వీటన్నిటినీ ఒక జిల్లా ఒక ఉత్పత్తి కింద డ్వాక్రా, మెప్మా మహిళా సంఘాల కృషితో రూపొందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాలలో ప్రసిద్ధి చెందిన వస్తువులైన గుంటూరు మిర్చి, ధర్మవరం పట్టు చీరలు, పావడాలు, కొండపల్లి బొమ్మలు, ఉదయగిరి చెక్కతో తీర్చిదిద్దిన ఉత్పత్తులు, ఏటికొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, అరకు కాఫీ, ఉప్పాడ చీరలు, వెంకటగిరి చీరలు, మంగళగిరి చీరలు, మచిలీపట్నం కలంకారి, బందరు లడ్డు, తిరుపతి లడ్డు వంటి వస్తువులకు బ్రాండింగ్ పెంచి ప్రపంచ స్థాయిలో మరింత మార్కెట్ పెంచాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తున్నట్లు మంత్రి బుగ్గన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్ భారత్ దిశగా సామాజిక, ఆర్థిక పరిపుష్ఠి సాధించడమే ఏపీ అంతిమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. పెవిలియన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన సహా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాల వలవన్, ఆంధ్ర భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ఆదిత్యనాథ్ దాస్, పరిశ్రమల శాఖ పెట్టుబడుల ప్రచారం, విదేశీవ్యవహారల సలహాదారు పీటర్ టీ హసన్ , ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఎన్వీ రమణా రెడ్డి ఐఆర్పీఎస్, హిమాన్షు కౌశిక్ ఐఏఎస్, లేపాక్షి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వ, పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్ జీఎస్ రావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆటా మహాసభలు: ఏపీ పెవిలియన్ ప్రారంభం
వాషింగ్టన్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడురోజుల పాటు వాష్టింగ్టన్ డీసీలో జరుగు తున్న ఈ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల, హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్ ఏపీ పెవిలియన్ ను ప్రారంభించారు. 17వ ఆటా కన్వెన్షన్ అండ్ యూత్ కాన్ఫరెన్స్‌లో డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, నేతలు హాజరైన ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్మి ప్రసాద్ రావు గుర్తు చేశారు. పలువురు రాజకీయ నాయకులు, కళాకారులు ఆటా వేడుకల్లో సందడి చేస్తున్నారు. - వాష్టింగ్టన్ డీసీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి -
ఏపీ పెవిలియన్‌ను అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి గౌతమ్‌రెడ్డి
-
సచిన్ జ్ఞాపికలు చోరీ
కొచ్చి: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన వన్డే బౌలింగ్ కెరీర్లో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ రెండూ కొచి్చలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలోనే (5/32– ఆస్ట్రేలియాపై 1998లో, 5/50 పాకిస్తాన్‌పై 2005లో)∙రావడం విశేషం. అతని పేరిట ఈ మైదానంలో సచిన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అభిమానులకు ప్రదర్శించడం కోసం సచిన్ తన టీమ్ జెర్సీ, సంతకం చేసిన బ్యాట్, బంతి జ్ఞాపకంగా అందజేశాడు. అయితే ఇప్పుడు సచిన్ పెవిలియన్‌లో వాటి జాడ కనిపించడం లేదు. విషయం బయటపడే సరికి స్టేడియం అధికారులు ఇతరులపై తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వెతికినా అవి లభించలేదు. చివరకు ప్రా«థమిక విచారణలో వాటిని ఎవరో దొంగతనం చేసినట్లు తేలింది. అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు కానీ... ఒక దిగ్గజ క్రికెటర్‌కు సంబంధించి వస్తువులను కనీసం జాగ్రత్తగా కూడా ఉంచకుండా అధికారులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మలీ్టపర్పస్ స్టేడియం కేరళ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ పరిధిలోనే ఉంది. -
ఎవరి కిస్‌లో కిక్కు..!
ముద్దంటే చేదా... ఆ ఉద్దేశం లేదా... అంటూ దాని కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేవారే ఎక్కువ. కానీ... కిస్ల్లోనూ కొలవూనాలుంటాయుని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. పదం చిన్నదే అయినా... సబ్జెక్టు పెద్దదంటున్నారు రసిక ప్రియులు. బాలీవుడ్ భామలు సన్నీ లియోన్... ఆలియూభట్ల్లో ఎవరి ముద్దులో కిక్కెక్కువన్నది ఇప్పుడు వారి ప్రశ్న. బిగ్స్క్రీన్పై కిస్ల పంట పండించినవారిలో టాప్ వీళ్లే. ఓ సినివూలో అర్జున్ కపూర్‌కు లిప్ కిస్ ఇచ్చి ఆలియూ.. సహ నటి సంధ్యా మదుల్ పెదాలు కొరికి సన్నీ సంచలనం రేపారు. ఇక టాప్ ఎవరనే చాయిస్ మీదే..! బ్యాక్ టు పెవిలియన్..! సక్సెస్నిచ్చిన సౌత్ ఇండస్ట్రీని వదిలేసి బాలీవుడ్లో పిల్లిమొగ్గలేసిన ఆసిన్‌కు ఇప్పటికి జ్ఞానోదయుమైనట్టుంది. అక్కడ తన సినివూలన్నీ బాక్సాఫీసుల్లో బోల్తా పడటంతో పెట్టేబేడా సర్దుకొని మళ్లీ దక్షిణాదికి వస్తోందట. త్వరలోనే ఇక్కడ ఓ సినివూ చేయబోతోందని ఆమె సోషల్ నెట్వర్క్ పేజీలో పోస్టింగ్ సారాంశం. ఏదిఏమైనా సౌత్‌లో బేస్ క్యాంప్ ఎత్తేసి ముంబైకి షిఫ్ట్ అయిన ఈ అమ్మడికి... సౌత్‌పై ప్రేమ కంటే అక్కడి ఫ్లాప్‌ల ఎఫెక్టే ఎక్కువనేది ఇక్కడి సినీజనుల టాక్. డేటింగ్లో అప్డేట్..! డేటింగ్లో కూడా ‘అప్డేట్’ ఉంటేనే మజా అంటోంది పాప్‌స్టార్ బ్రిట్నీ స్పియర్స్. బాయ్ ఫ్రెండ్ డేవిడ్ లుకాడో తనను చీట్ చేశాడని తొలిసారి ప్రకటించిందీ భావు. ‘నా ప్రియుడు నన్ను మోసగించాడని మీకు తెలుసని నాకు తెలుసు’ అంటూ లాస్‌వెగాస్‌లో ఓ షో సందర్భంగా గోడు వెళ్లబోసుకుంది. ‘అయితే నాకు దీని వల్ల వుంచే జరిగింది. ఇప్పుడు సాధ్యమైనన్ని ఫస్ట్ డేట్స్‌ను ఎంజాయ్ చేయగలుగుతున్నా’ అంటూ అసలు విషయుం చెప్పేసిందీ స్వీటీ.