కొచ్చి: దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన వన్డే బౌలింగ్ కెరీర్‌లో రెండుసార్లు 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ రెండూ కొచి్చలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలోనే (5/32– ఆస్ట్రేలియాపై 1998లో, 5/50 పాకిస్తాన్‌పై 2005లో)∙రావడం విశేషం. అతని పేరిట ఈ మైదానంలో సచిన్ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అభిమానులకు ప్రదర్శించడం కోసం సచిన్ తన టీమ్ జెర్సీ, సంతకం చేసిన బ్యాట్, బంతి జ్ఞాపకంగా అందజేశాడు. అయితే ఇప్పుడు సచిన్ పెవిలియన్‌లో వాటి జాడ కనిపించడం లేదు. విషయం బయటపడే సరికి స్టేడియం అధికారులు ఇతరులపై తప్పును తోసివేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వెతికినా అవి లభించలేదు. చివరకు ప్రా«థమిక విచారణలో వాటిని ఎవరో దొంగతనం చేసినట్లు తేలింది. అధికారికంగా దీనిపై ఇంకా ఎలాంటి పోలీసు ఫిర్యాదు నమోదు కాలేదు కానీ... ఒక దిగ్గజ క్రికెటర్‌కు సంబంధించి వస్తువులను కనీసం జాగ్రత్తగా కూడా ఉంచకుండా అధికారులు బాధ్యతారాహిత్యంతో వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ మలీ్టపర్పస్ స్టేడియం కేరళ రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ పరిధిలోనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment