హైదరాబాద్, తెలంగాణ ప్రత్యేకతలు చాటేలా పోస్టర్లు
దావోస్‌లో ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ‘తెలంగాణ మీన్స్ బిజినెస్’(తెలంగాణ అంటేనే వాణిజ్యం) అనే థీమ్‌తో ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను హైదరాబాద్ ప్రత్యేకతలు చాటేలా తీర్చిదిద్దారు. గతంలో వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరు చోట్ల పెవిలియన్ కేటాయించగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలు తమ పెవిలియన్లు ఏర్పాటు చేశాయి.
హైదరాబాద్ నగర చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టేలా పెవిలియన్‌ను రూపొందించారు. చార్మినార్‌తోపాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ వంటి చిహ్నాలతో రూపొందించిన పోస్టర్లను ప్రదర్శిస్తున్నారు. దేశంలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో అత్యంత నివాస యోగ్యంగా హైదరాబాద్‌కు అనుబంధంగా 14 వేల ఎకరాల్లో నిర్మించే ఫ్యూచర్ సిటీ ప్రణాళికలను వివరించేలా పెవిలియన్‌ను తీర్చిదిద్దారు.
ఫ్యూచర్ సిటీలో 6వేల ఎకరాల్లో పర్యావరణ జోన్‌తోపాటు ‘వర్క్, లివ్, లెర్న్, ప్లే’కాన్సెప్ట్‌తో ఉండే ఫ్యూచర్ సిటీ నమూనా ప్రదర్శిస్తున్నారు. మెట్రో, అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డుతోపాటు మెట్రో విస్తరణ, రీజినల్ రింగు రోడ్డు తదితరాలను ప్రస్తావించారు. వీటితోపాటు నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ప్రముఖ విద్యా సంస్థలు ఐఎస్‌బీ, ట్రిపుల్ ఐటీ, నల్సార్ ప్రత్యేకతలను చాటేలా పోస్టర్లు రూపొందించారు.
Comments
Please login to add a commentAdd a comment