ప్రతికాత్మక చిత్రం
అహ్మదాబాద్ : గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సమయంలో భార్య నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, ఏకంగా ఆమె నాలుకను కత్తెరతో కట్ చేశాడో భర్త. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన అయూబ్ మన్సూర్(46) ఒక రోజు తన భార్య నాలుకను కత్తెరతో కట్ చేశాడని, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని ముక్కున వేలేసుకున్నారు.
మన్సూర్ చెప్పిన కథనం ప్రకారం తాను ఎప్పటిలాగే తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో లిప్‌లాక్ చేశానని, ఆ సమయంలో ఆమె నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, దీంతో ఊపిరిక ఆడలేదని, ఏంచేయాలో అర్థంకాక ఆమె నాలుకను కత్తెరతో కట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స ద్వారా నాలుకను అతికించామని, ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని వైద్యులు పేర్కొన్నారు.
అయూబ్ మన్సూర్
కాగా, బాధితురాలు మన్సూర్‌కి మూడో భార్య కావడం గమనార్హం. మొదటి బార్యను హత్య కేసులో మన్సూర్ పలు సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అనంతరం ముంబైకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా ఉంటుంది. మన్సూర్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment