tongue cutting
-
మైనర్‌ను గర్భవతిని చేసి.. జైలుకు పంపుతారని
హసన్‌పర్తి: మైనర్‌ను గర్భవతిని చేసిన కేసులో తనను జైలుకు పంపుతారనే భయంతో ఓ వివాహితుడు గొంతు కోసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ అర్బన్ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని 55వ డివిజన్ మునిపల్లికి చెందిన ఓదెల సతీష్‌కు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను పలుమార్లు లోబర్చుకున్నాడు. దీంతో బాలికకు కడుపు నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించగా గర్భం దాల్చినట్లు నిర్ధారించారు. బాధితురాలి కుటుంబసభ్యులు న్యాయం కోసం పెద్ద మనుషులను ఆశ్రయించగా, ఈ విషయం తెలుసుకున్న సతీష్ గ్రామం నుంచి పరారయ్యాడు. దీంతో అతని తల్లి ఓదెల పద్మను పంచాయితీకి రప్పించారు. ఇరువర్గాల మధ్య పెద్ద గొడవ జరగడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఓదెల పద్మను పోలీస్ స్టేషన్‌కు తరలించి రక్షణ కల్పించారు. అనంతరం బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు సతీష్ సాయంత్రం ఇంటికి రావడంతో.. గమనించిన బాధితురాలి కుటుంబసభ్యులు అతన్ని పట్టుకుని గొడవకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సతీష్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం తనను పోలీసులు జైలుకు పంపిస్తారన్న భయంతో వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతు కోసుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతడిని ఎంజీఎంకు తరలించారు. కాగా, సతీష్‌పై గతంలోనూ మైనర్‌పై లైంగిక దాడి కేసు నమోదైందని, అప్పుడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీస్ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. చదవండి: కర్ణాటకలో బ్లాయిమెయిల్: 400 సీడీలున్నాయి! -
లిప్‌లాక్ చేసి.. నాలుక కట్ చేశాడు
అహ్మదాబాద్ : గాఢంగా ముద్దుపెట్టుకుంటున్న సమయంలో భార్య నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, ఏకంగా ఆమె నాలుకను కత్తెరతో కట్ చేశాడో భర్త. ఈ ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌కు చెందిన అయూబ్ మన్సూర్(46) ఒక రోజు తన భార్య నాలుకను కత్తెరతో కట్ చేశాడని, ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణలో అతను చెప్పిన సమాధానాలు విని ముక్కున వేలేసుకున్నారు. మన్సూర్ చెప్పిన కథనం ప్రకారం తాను ఎప్పటిలాగే తన భార్యతో శృంగారం చేస్తున్న సమయంలో లిప్‌లాక్ చేశానని, ఆ సమయంలో ఆమె నోట్లో నాలుక ఇరుక్కుపోయిందని, దీంతో ఊపిరిక ఆడలేదని, ఏంచేయాలో అర్థంకాక ఆమె నాలుకను కత్తెరతో కట్ చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు. కాగా బాధితురాలిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. శస్త్ర చికిత్స ద్వారా నాలుకను అతికించామని, ప్రస్తుతం ఆమె ఎలాంటి ఆహారం తీసుకోవడంలేదని వైద్యులు పేర్కొన్నారు. అయూబ్ మన్సూర్ కాగా, బాధితురాలు మన్సూర్‌కి మూడో భార్య కావడం గమనార్హం. మొదటి బార్యను హత్య కేసులో మన్సూర్ పలు సార్లు జైలుకెళ్లి వచ్చాడు. అనంతరం ముంబైకి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేక ఆమె అతనికి దూరంగా ఉంటుంది. మన్సూర్‌పై పలు క్రిమినల్ కేసులు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు. -
తెలంగాణ సీఎం కార్యాలయం వద్ద కలకలం
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మంగళవారం కలకలం చోటుచేసుకుంది. సచివాలయంలోని సీ బ్లాకు వద్ద రాజు అనే సందర్శకుడు బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతడు సూరారం కాలనీలో నివసిస్తున్నాడు. గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించి వికలాంగుడిగా మారానని, తనకు ఫించన్ ఇప్పించాలని అధికారులను కోరేందుకు రాజు ఇక్కడికి వచ్చాడు. నిన్న కూడా అతడు సచివాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.