
తెలంగాణ సీఎం కార్యాలయం వద్ద కలకలం
తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మంగళవారం కలకలం చోటుచేసుకుంది.
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద మంగళవారం కలకలం చోటుచేసుకుంది. సచివాలయంలోని సీ బ్లాకు వద్ద రాజు అనే సందర్శకుడు బ్లేడుతో నాలుక కోసుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అతడు సూరారం కాలనీలో నివసిస్తున్నాడు. గతంలో ఆత్మహత్యకు ప్రయత్నించి వికలాంగుడిగా మారానని, తనకు ఫించన్ ఇప్పించాలని అధికారులను కోరేందుకు రాజు ఇక్కడికి వచ్చాడు. నిన్న కూడా అతడు సచివాలయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.