హల్చల్ చేస్తున్న లులియా- సల్మాన్ ఫోటో
ముంబై: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, ప్రియురాలు లులియా వాంటర్ సన్నిహితంగా ఉన్నఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. రొమేనియన్ ముద్దుగుమ్మ లులియా, సల్మాన్ ను ముద్దాడుతున్న ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. దుబాయ్ లో వీళ్లిద్దరు కలిసినపుడు ఈ ఫోటో చిక్కినట్టు సమాచారం. ఈ మధ్య సల్మాన్ ఖాన్ త్వరలో పెళ్లి చేసుకోనున్నాడనే వార్తల నేపథ్యంలో ఈ ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇటీవల చాలా సందర్భాలలో సల్మాన్, లులియా కలిసి దర్శనమిచ్చిన వార్తల్లో నిలిచారు.
మరోవైపు రొమానియన్ రియాల్టీ షోలో లులియా పాల్గొన్న వీడియోనొక దాన్ని సల్మాన్ ట్విట్టర్లో షేర్ చేశాడు. అంతేకాదు.. తనకు కూడా ఇలాంటి షో చేయాలని ఉందని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇక నేను పెళ్ళి చేసుకునేది అనుమానమే. ఆ వయసు దాటేసాను. కానీ పిల్లల్ని కనాలని ఉంది.. ఇద్దరు ముగ్గురు పిల్లలు కావాలని ఓ ఇంటర్యూలో చెప్పాడు. కాగా టాప్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపినా కథ మాత్రం పెళ్ళి పీటల దాకా వెళ్ళలేదు. ప్రసుతం రోమానియా నటి లులియా వాంటర్ తో సల్మాన్ డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు ఉన్నా, సల్మాన్ ఇంకా ధృవీకరించలేదు.