Viral Video: బాబోయ్‌..! చావును ముద్దాడాడు.. | This Man Kissing A Snake Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Viral Video: బాబోయ్‌..! చావును ముద్దాడాడు..

Published Mon, Nov 1 2021 12:15 PM | Last Updated on Mon, Nov 1 2021 3:14 PM

This Man Kissing A Snake Video Goes Viral On Social Media - Sakshi

ఈ మధ్య మనుషులకి వెర్రెక్కిందేమోననే అనుమానం వస్తుంది. ప్రాణాలను పెట్టుబడిగాపెట్టి ఎంతటి రిస్కుకైనా తెగిస్తున్నారు. తాజాగా అటువంటి సంఘటనకు చెందిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. 

పడగ విప్పి ఉ‍న్న పామును ముద్దాడుతున్న యువకుడు ఈ వీడియోలో కనిపిస్తాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన కొన్ని గంటల్లోనే ఈ వీడియో వైరల్‌ అయ్యింది. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. విష సర్పాలతో సెల్పీలు దిగడం, ముద్దాడటం... ఆ క్షణానికి థ్రిల్లింగ్‌గా అనిపించినా.. ఒక్కోసారి స్టంట్‌ బెడిసికొట్టి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని నెటిజన్లు సదరు వ్యక్తిపై మండిపడుతున్నారు. ఐతే మరికొందరేమో ఇది ఫేక్‌.. పాముకు కోరలు లేవేమోనని సరదాగా కామెంట్‌ చేశారు.

చదవండి: Crime Story: ప్రమాదం అంచున..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement