సోషల్ మీడియాలో లైక్స్, వ్యూస్ కోసం కొందరు బరితెగిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో పిచ్చి చేష్టలతో రెచ్చిపోతున్నారు. ఇతరులకు ఇబ్బంది కలుగుతుందన్న సోయి లేకుండా హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. బస్సు, మెట్రో, విమానం, రైల్లో ఆకతాయిల ఆగడాలు ఈమధ్య ఎక్కువై పోతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ మెట్రోలో అసాంఘిక కార్యక్రమాలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. పాపులర్ కావాలని చేస్తున్నారా? లేక పొరపాటుగా అలా జరిగిపోతోందా? తెలియదుగానీ మెట్రో పరువైతే బజారున పడే పరిస్థితి దాపురించింది. ఈ క్రమంలో ట్విటర్‌లో #DelhiMetro హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
గతంలో కొందరు ప్రేమికులు మెట్రోలో పబ్లిక్ ముందే ముద్దులు పెట్టుకుంటూ ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి మెట్రో రైలు కోచ్‌లో బనియన్, టవల్‌తో దర్శనమిచ్చాడు. ఇది మరవకముందే మరో జంట సిగ్గు విడిచి లిప్ కిస్ ఇచ్చుకున్నారు. నిన్న కాక మొన్న ఓ యువతి బికినీ ధరించి మెట్రోలో ప్రయాణించింది. ఈ వీడియోలన్నీ నెట్టింట్లో తెగ చక్కర్లు కొట్టాయి.
అయితే వరుస సంఘటనలకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ట్విటర్‌లో షేర్ చేస్తూ ఫిర్యాదు చేస్తున్నారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఇలాంటి పనులేంటని ప్రశ్నిస్తూ.. వీటిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. #DelhiMetro హాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో గళమెత్తుతున్నారు.
कल से सिर्फ Delhi Metro में ही travel करूंगा !!!!!! pic.twitter.com/l228ZEao1q
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) April 3, 2023
Another video of Delhi Metro.
— Barkha Trehan 🇮🇳 / बरखा त्रेहन (@barkhatrehan16) March 31, 2023
If this is an example of WOMEN EMPOWERMENT, then alas our young generation GIRLS can be victim of such EMPOWERMENT 🤦♂️
And this is exactly what SHAMELESS FEMINISTS want.
I would call it CULTURAL GEN*CIDE.#delhimetro @OfficialDMRC pic.twitter.com/BrmjBQ3u32
Comments
Please login to add a commentAdd a comment