Viral: Woman Judge Love With Murder Case Accused, CCTV Video Leaked- Sakshi
Sakshi News home page

Viral: నేరస్తుడితో లిప్‌లాక్‌ చేసిన మహిళా న్యాయమూర్తి.. వీడియో వైరల్

Published Wed, Jan 12 2022 6:36 PM | Last Updated on Wed, Jan 12 2022 9:47 PM

Viral: Woman Judge Love With Murder Case Accused, CCTV Video Leaked - Sakshi

ప్రేమ.. ఎప్పుడు, ఎవరి మధ్య చిగురిస్తుందో చెప్పలేం. రెండు అక్షరాల ప్రేమ రెండు జీవితాలను పెనవేస్తోంది. అయితే అందరి ప్రేమలు విజయవంతంగా ముగియవు.. కొన్ని మధ్యలోనే ముగిసిపోతాయాయి. సాధారణంగా స్నేహితులు, క్లాస్‌మెట్స్‌, సహోద్యోగులిద్దరూ ప్రేమలో పడటం చూశాం.  కానీ  న్యాయమూర్తి, నేరస్తుడితో ప్రేమలో పడినట్లు మీరు ఎప్పుడైనా విన్నారా? వినడానికి కొంచెం వింతగా నిజంగానే ఇది జరిగింది.  ఒక మహిళా న్యాయమూర్తి ఏకంగా హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తితో ప్రేమలో పడింది.

దక్షిణ చుబుట్‌ ప్రావిన్స్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి, నిందితుడు జైల్లో రొమాన్స్‌ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో వీరిద్దరూ ఒకరినొకరు ముద్దు పెట్టుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది. డెయిలీ మెయిల్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఘటన అర్జెంటీనాలో డిసెంబరు 29న చోటుచేసుకుంది. ఇందులో ఓ పోలీస్‌ అధికారిని హత్య చేసిన జైలులో ఉన్న క్రిస్టియన్ ‘మై’ బస్టోస్‌ అనే ఖైదీ న్యాయమూర్తి మారియల్ సువారెజ్ ముద్దుపెట్టుకుంది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది:
చదవండి: వైరల్‌: దొంగతనానికి వచ్చి.. ఆకలేయడంతో వంటగదిలో కిచిడీ వండుతూ..

2009లో పోలీస్‌ అధికారి లియాండ్రో 'టిటో' రాబర్ట్స్‌ని బస్టోస్‌ హత్య చేశాడు. అతనికి జీవిత ఖైదు విధించాలా వద్దా అని నిర్ణయించే న్యాయమూర్తుల ప్యానెల్‌లో మారియల్ భాగం. బస్టోస్‌కు జీవిత ఖైదుకు వ్యతిరేకంగా ఓటు వేసిన ఏకైక న్యాయమూర్తి ఆమె. బస్టోస్‌ను ‘అత్యంత ప్రమాదకరమైన ఖైదీ’ అని చెప్పినప్పటికీ, యావజ్జీవ శిక్షకు వ్యతిరేకంగా ఓటు వేసిన ప్యానెల్‌లోని ఏకైక న్యాయమూర్తి సువారెజ్‌. బస్టోస్‌ను రక్షించడానికి ఆమె ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. దీంతో అతడికి జీవిత ఖైదు శిక్ష విధించారు. మరోవైపు  మహిళా న్యాయమూర్తి ఖైదీని ముద్దు పెట్టుకుంటున్న వీడియో బయటపడడంతో దీనిపై విచారణ జరుగుతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి తెలిపారు.
చదవండి: కోపంతో రెచ్చిపోయిన మహిళ.. రోడ్డుపై పండ్లు విసురుతూ.. వీడియో వైరల్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement