ముద్దు పెట్టుకోలేదా? | Ranveer Singh, Vaani Kapoor in the first 'no kissing' still from 'Befikre' | Sakshi
Sakshi News home page

ముద్దు పెట్టుకోలేదా?

Published Wed, Aug 24 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:33 AM

ముద్దు పెట్టుకోలేదా?

ముద్దు పెట్టుకోలేదా?

 ‘ముద్దుతో ఓనమాలు నేర్పించనా.. సిగ్గుల్లో ఆనమాలు చూపించనా’ అని ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో మోహన్‌బాబు, నగ్మా పాడుకున్న పాట గుర్తుందా? రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్ జంటగా ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత ఆదిత్యా చోప్రా స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న హిందీ సినిమా ‘బేఫికర్’ స్టిల్స్ చూస్తే ఠక్కున ఈ పాట గుర్తు రాకుండా ఉండదు. ‘బేఫికర్’ అంటే నిశ్చింతగా ఉండటం అని అర్థం. టైటిల్‌కి తగ్గట్టు నిశ్చింతగా గాల్లో ఎగురుతూ ప్రియుడి పెదాలపై ఓ ముద్దు.. డ్యాన్స్ చేస్తూ మరో ముద్దు.. బీచ్‌లో ఇంకో ముద్దు..
 
 ప్యారిస్ నగరం అంతా కనబడేలా ఓ బిల్డింగ్ టై మీద కూర్చుని మళ్లీ ముద్దు.. ముద్దులు తప్ప సినిమాలో ఇంకేమీ లేనట్టు రణ్‌వీర్ సింగ్, వాణీ కపూర్‌లు లిప్‌లాక్‌లతో రెచ్చిపోయారు. పెదవి ముద్దుల పోస్టర్లతోనే సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఏంటీ ముద్దులు? అని ఎవరైనా అడిగితే.. కళాత్మక దృష్టితో చూడండని సలహా కూడా ఇచ్చారు చిత్రబృందం. ఇప్పటివరకూ విడుదల చేసిన పోస్టర్స్ అన్నీ ముద్దుకి సంబంధించినవే.
 
  వాణీ కపూర్ బర్త్‌డే సందర్భంగా లిప్‌లాక్ లేకుండా ఓ స్టిల్ రిలీజ్  చేసేసరికి షాకవ్వడం ప్రేక్షకుల వంతైంది. నార్మల్‌గా లిప్‌లాక్ స్టిల్స్ ఆడియన్స్‌లో డిస్కషన్స్‌కి కారణం అవుతాయి. బట్ ఫర్ ఎ చేంజ్.. ఈసారి ముద్దు పెట్టుకోలేదా ఏంటీ? అంటూ రివర్స్‌లో ఆడియన్స్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాలో మొత్తం 23 ముద్దులున్నాయట. ప్రతి ముద్దుకీ కథలో ప్రాముఖ్యత ఉంటుందట. డిసెంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement