పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు! | China police warn commuters against kissing in subways | Sakshi
Sakshi News home page

పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు!

Published Wed, Jul 22 2015 10:29 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 AM

పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు!

పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు!

బీజింగ్: బహిరంగ చుంబనాలకు దిగితే చర్యలు తప్పవని చైనా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సబ్ వేలో హద్దులు దాటితే దండన తప్పదని ప్రకటించారు. పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటే విచారిస్తామని వార్నింగ్ ఇచ్చారు.

ఎందుకు వద్దంటున్నారు...
వాయువ్య చైనాలోని లియోనిన్ ప్రావిన్స్ షన్ యాంగ్ సబ్ వే ట్రైయిన్ లో ఓ యువజంట ముద్దులాడుకుంటూ వీడియోకు చిక్కింది. ఈ వీడియో ఇంటర్నెట్ కు ఎక్కడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో కాస్త మర్యాద పాటించండి అంటూ హితవు పలికారు. పబ్లిగ్గా చుంబనాలకు దిగితే చుట్టూవున్న చిన్నపిల్లల పరిస్థితి ఏంటని మరో నెటిజన్ ప్రశ్నించారు.

దీంతో స్పందించిన పోలీసులు 'కిస్సింగ్' జంటను పట్టుకునే పనిలో పడ్డారు. పబ్లిగ్గా ఇలాంటి పనులకు దిగితే దర్యాప్తు ఎదుర్కొవాల్సివుంటుందని హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రేమ పక్షులు మాత్రం కెమెరాలకు చిక్కకుండా చాటుగా చుంబనాలు సాగిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement