shenyang
-
లైవ్‌లో పిడుగు.. నడిరోడ్డుపై నిప్పుల వాన
-
లైవ్‌లో పిడుగు.. నడిరోడ్డుపై నిప్పుల వాన
బీజింగ్: లైవ్‌లో ఎప్పుడైనా పిడుగును చూశారా? దాని తీవ్రత ఎలా ఉంటుందో.. అది పడ్డాక ఎలాంటి వస్తువైనా ఎలా కాలిపోతుందో ఎప్పుడైనా గమనించారా? కానీ, చైనాలోని షెన్యాంగ్ ప్రాంత ప్రజలకు ఆ అవకాశం దక్కింది. అది కూడా రోడ్ల మీద రయ్‌మంటూ దూసుకెళ్లే వాహన చోదకులకు. అవును ఈ నెల(మే) 11న చైనాలోని లియానింగ్ ప్రావిన్స్‌లోగల షెన్యాంగ్లో పెద్ద మొత్తంలో గాలిదుమ్ము వచ్చింది. ఆ సమయంలో వర్షంపడటంతోపాటు పెద్ద పెద్ద ఉరుములు శబ్ధం కూడా వినిపిస్తోంది. సరిగ్గా అదే సమయంలో షెన్యాంగ్‌లోని రద్దీగా ఉండే ఓ కాలనీలో కారు వాహనదారులు తమ కార్ల వైఫర్లు ఆన్ చేసుకొని దూసుకెళుతుండగా నడి రోడ్డుపై భారీ పిడుగు పడింది. దీంతో రోడ్డుపక్కన ఉన్న చెట్లు మాడిపోయి వాటి ఆకులన్నీ కూడా నిప్పుల వర్షంలాగా కురిశాయి. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ వారంతా కూడా తమ వాహనాలు ఎక్కడికక్కడ ఆపేసి గజగజ వణికిపోయారు. తొలుత ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్మినట్లు అని ఆ వెంటనే భారీ వెళుతురుతో నిప్పుల వర్షాన్ని కురిపించింది ఆ పిడుగు. అయితే, అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఓ కారులోని కెమెరాలో రికార్డయిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
2000 సంవత్సరాల కిందటి పట్టణం!
బీజింగ్: చైనాలో అతి పురాతన పట్టణం బయటపడింది. 2000 ఏళ్ల కిందటి చిన్నపాటి నగరంలాంటిదాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు బయటకు తీశారు. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ అనే పురాతన ప్రాంతంలో రెండువేల ఏళ్ల కిందటే ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగిన పట్టణం ఉందని అక్కడి సిటీ కల్చరల్ అండ్ ఆర్కియాలజీ ఇనిస్టిట్యూట్ గుర్తించింది. జూలై 2016 నుంచి హునాన్ జిల్లాలోని కింగ్జువాంగ్జి అనే నగరానికి సమీపంలోని షెన్యాంగ్ అనే ప్రాంతంలో 500 స్క్వేర్ మీటర్లు తవ్వకాలు జరిపారు. అందులో పురాతత్వ శాస్త్రవేత్తలు ఇంటి నిర్మాణాలు, సెల్లార్లు, యాష్ కుండీలు, సమాధులు గుర్తించారు. కుండపెక్కులు, కాంస్యవస్తువులు, రాగి వస్తువులు కూడా బయటకు తీశారు. వీటిని పరిశీలించిన వారు 2000 కిందటిదని కనిపెట్టారు. -
పబ్లిగ్గా ముద్దులు పెట్టుకోవద్దు!
బీజింగ్: బహిరంగ చుంబనాలకు దిగితే చర్యలు తప్పవని చైనా పోలీసులు హెచ్చరిస్తున్నారు. సబ్ వేలో హద్దులు దాటితే దండన తప్పదని ప్రకటించారు. పబ్లిగ్గా ముద్దులు పెట్టుకుంటే విచారిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఎందుకు వద్దంటున్నారు... వాయువ్య చైనాలోని లియోనిన్ ప్రావిన్స్ షన్ యాంగ్ సబ్ వే ట్రైయిన్ లో ఓ యువజంట ముద్దులాడుకుంటూ వీడియోకు చిక్కింది. ఈ వీడియో ఇంటర్నెట్ కు ఎక్కడంతో నెటిజన్లు ఘాటుగా స్పందించారు. బహిరంగ ప్రదేశాల్లో కాస్త మర్యాద పాటించండి అంటూ హితవు పలికారు. పబ్లిగ్గా చుంబనాలకు దిగితే చుట్టూవున్న చిన్నపిల్లల పరిస్థితి ఏంటని మరో నెటిజన్ ప్రశ్నించారు. దీంతో స్పందించిన పోలీసులు 'కిస్సింగ్' జంటను పట్టుకునే పనిలో పడ్డారు. పబ్లిగ్గా ఇలాంటి పనులకు దిగితే దర్యాప్తు ఎదుర్కొవాల్సివుంటుందని హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేశారు. ప్రేమ పక్షులు మాత్రం కెమెరాలకు చిక్కకుండా చాటుగా చుంబనాలు సాగిస్తున్నారు.