2000 సంవత్సరాల కిందటి పట్టణం!
బీజింగ్: చైనాలో అతి పురాతన పట్టణం బయటపడింది. 2000 ఏళ్ల కిందటి చిన్నపాటి నగరంలాంటిదాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు బయటకు తీశారు. చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ అనే పురాతన ప్రాంతంలో రెండువేల ఏళ్ల కిందటే ఒక ప్రత్యేక సంస్కృతిని కలిగిన పట్టణం ఉందని అక్కడి సిటీ కల్చరల్ అండ్ ఆర్కియాలజీ ఇనిస్టిట్యూట్ గుర్తించింది.
జూలై 2016 నుంచి హునాన్ జిల్లాలోని కింగ్‌జువాంగ్జి అనే నగరానికి సమీపంలోని షెన్యాంగ్ అనే ప్రాంతంలో 500 స్క్వేర్ మీటర్లు తవ్వకాలు జరిపారు. అందులో పురాతత్వ శాస్త్రవేత్తలు ఇంటి నిర్మాణాలు, సెల్లార్లు, యాష్ కుండీలు, సమాధులు గుర్తించారు. కుండపెక్కులు, కాంస్యవస్తువులు, రాగి వస్తువులు కూడా బయటకు తీశారు. వీటిని పరిశీలించిన వారు 2000 కిందటిదని కనిపెట్టారు.