మోదీ ఫొటోకు ముద్దిస్తున్న మహిళ (వీడియోలోని ఫొటో)
న్యూఢిల్లీ: పూల్వామా ఉగ్రదాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ తీవ్రవాద తండాలపై భారత్ సైన్యం మెరుపు దాడులు చేయడంతో ప్రధాని నరేంద్ర మోదీని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు. మోదీపై అభిమానాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. మోదీ మహిళా అభిమానికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.
రైలు బోగీపై ఉన్న ప్రధాని మోదీ ఫొటోను గాఢంగా ముద్దు పెట్టుకుని, కెమెరాకు స్మైల్ ఇచ్చి ముందుకు సాగిపోయింది ఓ మహిళా అభిమాని. ట్విటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసి.. ‘ఇలా కూడా అభిమానాన్ని ప్రదర్శిస్తారంటూ’ కామెంట్ పెట్టారు. మోదీపై పెరుగుతున్న అభిమానానికి ఇది నిదర్శనమని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అయితే వీడియో ఉన్న మహిళ ఎవరు? ఇది ఎక్కడ, ఎప్పుడు జరిగింది అనే వివరాలు వెల్లడికాలేదు. మోదీ వీడియోకు సమాధానంగా ‘ఇలా కూడా జరుగుతుంది’ అంటూ రాహుల్ గాంధీని నేరుగా మహిళా ముద్దుపెట్టుకున్న వీడియోను మరొకరు రీపోస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment