పెళ్లి అంటే విందులో నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే. అయితే వివాహ విందులో చేపల కూర, మాసం పెట్టకపోవటంతో వరుడు తరఫు బంధవులు, వధువు తరఫులు బంధవుల మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. విందులో చేపలు మాంసం లేకపోవటంతో కోపోద్రుక్తులైన వరుడి బంధువులు.. కర్రలో వధువు తరఫు బంధువలపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకొగా.. అలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకోవడానికి అభిషేక్ శర్మ, ఆయన బంధువులు డియోరియా జిల్లాలోని ఆనంద్ నగర్ గ్రామానికి వచ్చారు. అయితే విందులో మాంసాహారం లేదనని.. వధువు తరఫువాళ్లు వరుడి బంధువులకు తెలియజేశారు. దీంతో పెళ్లి కొడుకు తండ్రి సురేంద్ర శర్మ, మిగతా బంధువులో కలిసి మాసం పెట్టకపోవటంపై పెళ్లికూతురు తరఫువాళ్లను దారుణంగా తిట్టారు.
ఇరువర్గాల వారు చైర్లు విసిరేసుకుంటూ గొడవకు దిగారు. అక్కడి ఆగకుండా పెళ్లికూతురు ఫ్యామిలి, బంధవులపై వధువు బంధువులు పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో దాడి చేశారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడి నుంచి పెళ్లి కొడుకు వెళ్లిపోయారు. అనంతరం పెళ్లి కూతురు తండ్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు, అతని ఫ్యామిలి తమపై తీవ్రంగా దాడి చేసి, రూ. 5 లక్షల కట్నం డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment