లక్నో: ఇటీవల కొన్ని వివాహాలు మంటపాల్లోనే పలు కారణాల వల్ల రద్దవుతున్నాయి. ఇదే తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో వెలుగు చూసింది. ముహుర్తం సమయానికి ముందు వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని గ్రహించిన వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిశ్రౌలి గ్రామానికి చెందిన యువతితో కేజూరి గ్రామానికి చెందిన యువకుడికి జూన్ 5న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు.
పెళ్లి రోజు ముహూర్త సమయానికి వరుడితో పాటు బంధువులు ఊరేగింపుగా మంటపానికి చేరుకున్నాడు. అదే సమయంలో వరుడు గుట్కా నములుతూ వధువుకు కనిపించాడు. దీంతో తనకు వరుడు గుట్కా నమలడం నచ్చలేదంటూ, వివాహం వద్దని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి జరగాలని వధువుకు ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ యువతి పెళ్లికి ససేమిరా అనేసింది. చివరికి చేసేదేమి లేక ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలను తిరిగి ఇచ్చేశారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక వారంలో ఇలాంటి రెండవ సంఘటన ఇది. గత వారం, ప్రతాప్‌ఘర్ జిల్లాలో ఓ వధువు వరుడు తాగి వచ్చి అతనితో కలిసి నృత్యం చేయమని బలవంతం చేయగా, విసుగు చెందిని వధువు ఇలానే పెళ్లి ఆపేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment