ballia
-
లోక్‌సభ బరిలో మాజీ ప్రధాని కొడుకు..
లక్నో: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ కుమారుడు నీరజ్ శేఖర్ బరిలో నిలిచారు. ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. తాను ఇప్పటికీ సోషలిస్టు సిద్ధాంతంతోనే ఉన్నానని, రామ్ మనోహర్ లోహియా ఆలోచనలకు సమాజ్‌వాదీ పార్టీ దూరం జరిగిందని విమర్శించారు. "సోషలిస్టు భావజాలాన్ని ఎస్పీతో ముడిపెట్టకూడదు. నేను ఇప్పటికీ వ్యక్తిగతంగా సోషలిస్టు భావజాలంతోనే ముడిపడి ఉన్నాను" అని నీరజ్ శేఖర్ పీటీఐతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఎందుకంటే ఆయన తండ్రి దివంగత చంద్రశేఖర్ సోషలిస్ట్ భావజాలాన్ని ప్రతిపాదించినవారు. కాషాయ పార్టీని తీవ్రంగా విమర్శించేవారు. చంద్ర శేఖర్ కుటుంబం మొత్తం ప్రస్తుతం బీజేపీలో ఉంది. అతని పెద్ద కుమారుడు పంకజ్ శేఖర్, చిన్న కుమారుడు నీరజ్ శేఖర్ కాషాయ పార్టీలో ఉండగా, అతని మనవడు రవిశంకర్ సింగ్ పప్పు ఉత్తరప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. గతంలో బల్లియా నుంచి ఎస్పీ ఎంపీగా పనిచేసిన నీరజ్ శేఖర్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో బల్లియా నుంచి బీజేపీ అభ్యర్థి భరత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. దీంతో 2019 ఎన్నికల్లో నీరజ్ శేఖర్‌కు ఎస్పీ టికెట్ నిరాకరించింది. తర్వాత ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా చేసినప్పటికీ, నీరజ్ శేఖర్ పార్టీని వీడి 2019 జూలైలో బీజేపీలో చేరారు. బల్లియా నుంచి ప్రస్తుత ఎంపీ వీరేంద్ర సింగ్ మస్త్ స్థానంలో నీరజ్ శేఖర్ అభ్యర్థిత్వాన్ని బీజేపీ తాజాగా ప్రకటించింది. 2019లో అప్పటి ప్రస్తుత ఎంపీ భరత్ సింగ్‌పై కాషాయ పార్టీ మస్త్‌కు ఎన్నికల టిక్కెట్‌ను ఇచ్చింది. -
యూపీ పాఠశాలలో 9 మంది విద్యార్థులకు మంకీపాక్స్.. లక్షణాలివే..!
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ బలియా జిల్లాలో చికెన్‌పాక్స్ కలకలం రేపింది. గోవింద్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు సహా 9 మంది విద్యార్థులు ఈ వ్యాధి బారినపడ్డారు. ఈ విద్యార్థుల్లో కొద్దిరోజుల క్రితం నుంచే చికెన్‌పాక్స్ లక్షణాలు కన్పించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఒంటిపై, మొహంపై దద్దుర్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. వీరందరికీ చికెన్‌పాక్స్ సోకిందనని శుక్రవారం నిర్ధరణ అయినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వెంటనే వారికి చికిత్స ప్రారంభించినట్లు చెప్పారు. ఈ వ్యాధి ఇతరులకు సోకకుండా నియంత్రణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. చికెన్ పాక్స్ లక్షణాలు.. ► తీవ్రమైన జ్వరం ► గొంతులో ఇబ్బందిగా అన్పించడం ► ఒళ్లుమొత్తం ఎర్రటి దద్దుర్లు ► తలనొప్పి ► దురద చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
Video Viral: స్కూల్ విద్యార్థులతో టాయిలెట్ శుభ్రం చేయించిన ప్రిన్సిపాల్
లక్నో: ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులతో ప్రిన్సిపల్ టాయిలెట్లు శుభ్రం చేయిస్తున వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ దారుణ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బలియా జిల్లా పిప్రా గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ స్కూల్లోని విద్యార్థులను ప్రిన్సిపల్ వాష్‌రూమ్‌లు శుభ్రం చేయాలని ఆదేశించాడు. ప్రిన్సిపల్ పక్కన నిలబడి పిల్లలచేత టాయిలెట్లు కడిగించాడు. అంతేగాక విద్యార్థులకు మరుగుదొడ్డి సరిగ్గా శుభ్రం చేయాలని ఆదేశాలు ఇస్తున్నాడు. సరిగా క్లీన్ చేయకుంటే తాళం వేస్తానని, అప్పుడు అందరూ మల విసర్జన కోసం ఇంటికి వెళ్లాల్సి ఉంటుందని బెదిరించాడు. ఈ వ్యవహారాన్నంతా వీడియో తీసిన ఓ వ్యక్తి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. Primary School Students Made To Clean Toilet by Principle in Ballia, Uttar Pradesh. The incident was reported from Pipra Kala Primary School of Sohav Block in Ballia. pic.twitter.com/oYaqqBhFJA — Ahmed Khabeer احمد خبیر (@AhmedKhabeer_) September 8, 2022 ఇందులో కొందరు విద్యార్థులు టాయిలెట్‌ను శుభ్రం చేస్తుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్‌గా మారింది. అదికాస్తా అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించినట్లు విధ్యాశాఖ అధికారి అఖిలేష్ కుమార్ ఝా తెలిపారు. పాఠశాల ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: పగ తీర్చుకున్నాడు.. కాటేసిన పామును కసితీరా కొరికి -
పెళ్లి చేసుకుంటానని అత్యాచారం.. గర్భిణి ఫిర్యాదు
లక్నో: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌నగర్‌కు చెందిన అమిత్ మౌర్యతో 2019లో ఆమెకు పరిచయం ఏర్పడగా, కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి వారు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటట్లు తెలిపింది. పెండ్లి చేసుకుంటానని నమ్మించిన మౌర్య కొన్నాళ్లుగా తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాధితురాలు గర్భం దాల్చడంతో అతను ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని, పెళ్లి విషయమై గట్టిగా అడిగేసరికి చేసుకోనని తెగేసి చెప్పినట్లు ఆరోపించింది. అంతేగాక ఓ యువతి పేరిట ఫేస్బుక్లో నకిలీ ఖాతా సృష్టించిన మౌర్య తన అభ్యంతకరమైన చిత్రాలను కూడా అందులో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. చదవండి: కన్నతల్లి కర్కశత్వం: బతికుండగానే బావిలోకి తోసేసింది -
పెళ్లిలో గుట్కా నమిలిన వరుడు.. వధువు ఏం చేసిందంటే?
లక్నో: ఇటీవల కొన్ని వివాహాలు మంటపాల్లోనే పలు కారణాల వల్ల రద్దవుతున్నాయి. ఇదే తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో వెలుగు చూసింది. ముహుర్తం సమయానికి ముందు వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని గ్రహించిన వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిశ్రౌలి గ్రామానికి చెందిన యువతితో కేజూరి గ్రామానికి చెందిన యువకుడికి జూన్ 5న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి రోజు ముహూర్త సమయానికి వరుడితో పాటు బంధువులు ఊరేగింపుగా మంటపానికి చేరుకున్నాడు. అదే సమయంలో వరుడు గుట్కా నములుతూ వధువుకు కనిపించాడు. దీంతో తనకు వరుడు గుట్కా నమలడం నచ్చలేదంటూ, వివాహం వద్దని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి జరగాలని వధువుకు ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ యువతి పెళ్లికి ససేమిరా అనేసింది. చివరికి చేసేదేమి లేక ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలను తిరిగి ఇచ్చేశారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక వారంలో ఇలాంటి రెండవ సంఘటన ఇది. గత వారం, ప్రతాప్‌ఘర్ జిల్లాలో ఓ వధువు వరుడు తాగి వచ్చి అతనితో కలిసి నృత్యం చేయమని బలవంతం చేయగా, విసుగు చెందిని వధువు ఇలానే పెళ్లి ఆపేసిన సంగతి తెలిసిందే. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
ముస్లింలు జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు: బీజేపీ ఎమ్మెల్యే
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ముస్లింలు ఇష్టమొచ్చినట్టుగా జంతువుల్లా కనిపారేస్తున్నారని విమర్శించారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘ముస్లిం కుటుంబాల్లో ఒక్కొక్కరికీ 50 మంది పెళ్లాలుంటారు. వాళ్లు 1050 మంది పిల్లల్ని కంటారు. ఇది వారి మత సాంప్రదాయం కూడా కాదు. ఇష్టమొచ్చినట్టు కంటూ జంతువుల్లా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా అయితే.. ఓ కుంటుంబంలో ఇద్దరు లేదా నలుగురు పిల్లలు మాత్రమే ఉంటారు. కానీ ముస్లిం కుటుంబాల్లో ఇందుకు భిన్నంగా ఉంది. అంటూ వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారు. సురేంద్రసింగ్ నోరు పారేసుకోవటం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు కూడా చాలాసార్లు నోరు జారి విమర్శలపాలయ్యారు. గతంలో హిందూ దంపతులు కనీసం ఐదుగురి పిల్లల్ని కనాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీని ద్వారా హిందుత్వాన్ని కాపాడిన వారవుతారని ఆయన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. గత మార్చి నెలలో సైతం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి అనుచిత సలహానిస్తూ పతాక శీర్షికల్లోకెక్కారు. రాహుల్‌ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ‘‘మీ తల్లి ఇటలీలో ఉన్నప్పుడు ఏ వృత్తిలో కొనసాగిందో, హర్యాన్వి గాయని, డ్యాన్సర్ సప్న చౌదరి కూడా అదే వృత్తిలో ఉన్నారు. కాబట్టి మీరిద్దరూ పెళ్లి చేసుకోవచ్చు కదా’’ అని కామెంట్స్ చేసిన విషయం విదితమే. ఆ తర్వాతి కాలంలో బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిపై కూడా మాటల దాడికి దిగారు. మాయావతి వయస్సు 60 సంవత్సరాలు దాటినా అందంగా కనిపించడం కోసం ఫేషియల్ చేయించుకుంటుందని ఎద్దేవా చేశారు. యవ్వనంగా కనిపించడం కోసం జుట్టుకు రంగులు వేసుకుంటుందని విమర్శించారు. ఇక దేశంలో అత్యాచారాలు, మహిళలపై దాడులు పెరిగిపోవటానికి పిల్లల తల్లిదండ్రులు, మొబైల్ ఫోన్లే ప్రధాన కారణమంటూ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడి విమర్శల పాలయ్యారు. -
'వారి కోసం పనిచేస్తే ఎంతో ఆనందం'
వారణాసి: పేదల ప్రజల సాధికారతకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆదివారం తన నియోజకవర్గం వారణాసిలో ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. లబ్ధిదారులకు ఈ-రిక్షాలు, ఈ-పడవలు అందజేశారు. సంక్షేమ పథకాలతో నిరుపేదలు బలోపేతం కావాలని, ఓటు బ్యాంకు కాదని మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. పేదలకు చేయూతనిస్తే పేదరికం నుంచి బయటపడతారని చెప్పారు. తాము ప్రవేశపెట్టిన 'జన్ ధన్ యోజన'తో బ్యాంకులు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. పేద ప్రజల అభ్యన్నతి కోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. వారణాసిలో ఈ- రిక్షా, ఈ-పడవల్లో మోదీ ప్రయాణించారు. అంతకుముందు బాలియాలో 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పథకాన్ని ఆయన ప్రారంభించారు. పేద మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు పంపిణీ చేశారు. 5 కోట్ల మంది పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వనున్నట్టు ఈ సందర్భంగా తెలిపారు. -
'మా అమ్మ కట్టెలపొయ్యిపై వండేది'
బలియా: తాను ఓ చిన్న ఇంట్లో జన్మించానని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఆ ఇంటికి కిటికీలు ఉండేవి కావని చెప్పారు. తన తెల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేదని.. ఆ సమయంలో ఇంట్లో నిండుకున్న పొగలో అమ్మ సరిగా కనిపించకపోయేదని గత స్మృతులు నెమరువేసుకున్నారు. తన తల్లిలాగా ఏ స్త్రీమూర్తి శ్రమించకూడదనే తన ఉద్దేశం అని చెప్పారు. ఆదివారం ఉదయం ఉత్తరప్రదేశ్ లోని బలియాలో ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ మాటలు అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువున ఉన్న పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్‌ను అందించే ఉద్దేశంతో దాదాపు రూ.8000 కోట్లతో రూపొందించిన ఈ ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఏం అన్నారంటే.. 'బలియా పోరాటాల గడ్డ. ఈ నేల దేశ స్వాతంత్ర్యం కోసం ఒక మంగళ్ పాండేను ఇచ్చింది. ఇక్కడి ప్రజలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. మేడే సందర్భంగా మనమంతా ఇక్కడ సమావేశం అయ్యాం. ఈ సందర్భంగా దేశ పురోగతికి నిరంతరం శ్రమిస్తున్న కార్మికులందరికీ నా ధన్యవాదాలు, ప్రశంసలు. వారి సేవలు నిరుపమానం. మా ప్రభుత్వం పేదలకోసం, కార్మికుల కోసం పనిచేసే ప్రభుత్వం. మేం ఏచేసినా వారికోసమే. ప్రపంచం మొత్తాన్ని ఐక్యంగా ఉంచేది కార్మికులే. బలియాలో గ్యాస్ కనెక్షన్ లు చాలా తక్కువగా ఉన్నాయనే నేను ఇక్కడ ఈ పథకం ప్రారంభిస్తున్నాను. పేద కుటుంబాలకు, పే మహిళలకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని నేను ఈ పనిచేయలేదు. గతంలో ఎన్నికలు లేని చోట్ల కూడా ఎన్నో పథకాలు ప్రారంభించాను' అని మోదీ చెప్పారు.