
లక్నో: తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్‌నగర్‌కు చెందిన అమిత్ మౌర్యతో 2019లో ఆమెకు పరిచయం ఏర్పడగా, కొంత కాలానికి ప్రేమగా మారింది. ఇక అప్పటి నుంచి వారు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నటట్లు తెలిపింది.
పెండ్లి చేసుకుంటానని నమ్మించిన మౌర్య కొన్నాళ్లుగా తనపై అత్యాచారం చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఇటీవల బాధితురాలు గర్భం దాల్చడంతో అతను ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని, పెళ్లి విషయమై గట్టిగా అడిగేసరికి చేసుకోనని తెగేసి చెప్పినట్లు ఆరోపించింది. అంతేగాక ఓ యువతి పేరిట ఫేస్‌బుక్‌లో నకిలీ ఖాతా సృష్టించిన మౌర్య తన అభ్యంతకరమైన చిత్రాలను కూడా అందులో పోస్ట్ చేస్తున్నట్లు వెల్లడించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment