UP Sambhav Groom Kisses Infront Of Relatives, Later Bride Cancels Marriage - Sakshi
Sakshi News home page

300 మంది ముందు ముద్దు పెట్టాడని పెళ్లి రద్దు చేసుకున్న వధువు

Published Wed, Nov 30 2022 5:02 PM | Last Updated on Wed, Nov 30 2022 7:52 PM

Up Sambhav Groom Kisses Bride She Cancels Marriage - Sakshi

లక్నో: పెళ్లైన ఆనందంలో వరుడు చేసిన కొంటెపని అతని కొంప ముంచింది. పెళ్లిమండపంలోనే అందరి ముందు వధువుకు ముద్దు పెట్టడం అతని కలలను కల్లోలం చేసింది. వరుడి తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లికూతురు మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. ఇలాంటి వాడు తనకు వద్దే వద్దని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లికొడుకు తల పట్టుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ సంభల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ఏం జరిగిందంటే..?
యూపీ బాదాయు జిల్లా బిస్లీ గ్రామానికి చెందిన అబ్బాయి, సంభల్ జిల్లా పవాసకు చెందిన అమ్మాయి గతవారం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి దండలు మార్చుకున్న తర్వాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే స్టేజీ పైనుంచి లేచి గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

300 మంది ముందు అందరూ చూస్తుండగానే తనకు ముద్దు పెట్టిన వరుడి తీరు అసలు బాగాలేదని, ఇతను తన భర్తగా వద్దని వధువు పోలీసులకు చెప్పింది. ఇలాంటి వాడితో జీవితాంతం కలిసి బతకలేదని స్పష్టం చేసింది.

వరుడి కుటుంబసభ్యులు కూడా వధువు వెనకాలే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు కుటుంబాలు ఈ విషయంపై గొడవపడ్డాయి. పోలీసులు చెప్పినా వినలేదు. తనకు అతడు వద్దే వద్దని వధువు తేల్చిచెప్పింది.

బెట్ కట్టిందని చెప్పిన వరుడు
అయితే తాను కావాలని ముద్దు పెట్టలేదని, వధువే తనతో బెట్ కట్టిందని వరుడు పోలీసులకు చెప్పాడు. అందరి ముందు ముద్దు పెడితే రూ.1500 ఇస్తానని ఆమె చెప్పిందని, ఒకవేళ తాను ఓడిపోతే రూ.3000 ఇవ్వాలని చెప్పిందని వివరించాడు. వధువు మాత్రం అసలు తాను బెట్ కట్టలేదని చెప్పింది. అసలు ఇలాంటి ప్రస్తావనే తమ మధ్య రాలేదని స్పష్టం చేసింది.

వరుడితో వెళ్లేందుకు వధువు నిరాకరించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇద్దరికీ పెళ్లి జరిగింది కాబట్టి తామేమీ చేయలేమని, చట్ట ప్రకారం కోర్టులోనే విడాకులు తీసుకోవాలని సూచించారు.
చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement