సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్‌లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.
గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్‌కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్‌కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment