అల్లూరి, గంటందొర సమాధులు
గొలుగొండ(నర్సీపట్నం): స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులను చరిత్రాత్మక ప్రాంతాలుగా బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధుల వద్ద మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది.
రాష్ట్ర పరిపాలనా విభాగం కార్యదర్శి(ఇన్‌చార్జి) శ్రీకాంత్ నాగులపల్లి నుంచి ఆదేశాలు అందాయి. అల్లూరి పోరా టాలు, ఆయన సంచరించిన ప్రాంతాలపై 2011లో పురావస్తుశాఖ అధ్యయనం చేసింది. అయితే అప్పటిలో కచ్చితమైన సమాచారం లేకపోవడంతో చరిత్రాత్మక ప్రాంతంగా గుర్తించేకపోయారు.
తరువాత మళ్లీ అధ్యయనం చేసి, ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అల్లూరి, గంటందొర పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన ప్రాంతాలు, కృష్ణదేవిపేటలోని సర్వే నంబర్ 120–3–బిలో , 129– 3లో 1.28 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment