historical place
-
‘ఫోస్ డీయోన్’.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే..!
సృష్టి రహస్యాల్లో.. ప్రకృతి ఒడిసిపట్టిన అందాలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి సోయగానికి మానవనిర్మాణం జతకలిస్తే ఇదిగో ఇలానే.. అద్భుతం అనిపిస్తుంది. ‘ఫోస్ డీయోన్’.. ఇదో భూగర్భం జలాశయం. చూడటానికి పెద్ద బావిలా కనిపిస్తుంది. కానీ నిరంతర ఊట లాంటిది ఇది. ఫ్రాన్స్‌కు ఈశాన్యంలో ఉన్న టోనెరే నగరం నడిబొడ్డునున్న ఈ నీటి కొలను.. 18వ శతాబ్దంలో బయటపడిందట. ఆ వెంటనే ‘షెవాలీర్ డి ఇయాన్’ అనే రాయబారి దీన్ని అందమైన కట్టడంగా మార్పించాడు. గుండ్రటి పెద్ద నుయ్యి.. లోపలికి బయటికి కొన్ని మెట్లు.. అర్ధచంద్రాకారంలో ఇల్లు మాదిరి పెంకులతో చూరు కట్టించాడు. ఒకవైపు ఆ ప్రహరీకి ఆనుకుని పెద్దపెద్ద బిల్డింగ్స్ ఉంటే.. మరోవైపు ఆ జలాశయానికి తోవ ఉంటుంది. నీటిధారకు అనువుగా ఎత్తుపల్లాలతో నిర్మించిన ఈ నిర్మాణం.. స్వచ్ఛమైన నీళ్ల మధ్య ఆకుపచ్చని నాచుమొక్కలతో.. పరిసరాల ప్రతిబింబాలతో.. ఇట్టే ఆకట్టుకుంటుంది. అయితే ఈ పురాతనమైన నుయ్యి.. పైకి కనిపించినంత రమ్యమైనది మాత్రం కాదు. దీని లోతెంతో.. మూలమేంటో.. నేటికీ తెలియదు. తెలుసుకునే ప్రయత్నాలలో చాలామంది ప్రాణాలనే కోల్పోయారు. ఈ బావి నుంచి ప్రతి సెకనుకు 311 లీటర్ల నీరు బయటికి వస్తుంది. అయితే కాలానికి తగ్గట్టుగా దీని వేగం.. పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. దీనిలోపల పెద్దపెద్ద గుహలు, సున్నపురాయితో ఏర్పడిన సన్నటి సందులు, మలుపులు ఉంటాయి. అయితే ఫ్రెంచ్ ఇతిహాసాలు.. ఈ జలాశయం గురించి చాలా కథలను వినిపిస్తాయి. మధ్యయుగంలో మనుషులు.. ఈ నీటిని ఉపయోగించుకునే జీవనం కొనసాగించారట. 7వ శతాబ్దంలో ఈ కొలనును కాకాట్రైస్ అనే పాములాంటి జీవి ఆక్రమించుకుని.. మనుషుల్ని దరిదాపుల్లో తిరగనిచ్చేది కాదట. ఈ జీవి డ్రాగన్స్‌లా రెండు కాళ్లతో.. సగం కోడిపుంజులా.. సగం బల్లిలా కనిపిస్తుందట. ‘సెయింట్ జీన్ డి రీమ్’ అనే సన్యాసి.. అప్పట్లో ఈ కాకాట్రైస్ను చంపి.. ఈ బావిని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడట. ఈ ఫోస్ డీయోన్లో పొంగుతున్న నీరు.. ఎక్కడినుంచి వస్తుందో తేలలేదు. ఎంత ప్రత్యేక శిక్షణపొందిన డైవర్ అయినా సరే.. ఈ బావిలోకి దిగితే తిరిగి రావడం కష్టమే. మొదటిసారి 1974లో ఇద్దరు డైవర్స్.. దీని లోతును, జన్మస్థానాన్ని కనిపెట్టడానికి లోపలికి వెళ్లారు. కానీ తిరిగి రాలేదు. 1996లో మరొక డైవర్ అదే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో చాలా ఏళ్లపాటు దీనిలో ఈతకు అనుమతుల్లేకుండా పోయాయి. ఇక 2019లో డైవర్ పియరీ–ఎరిక్ డిజైనే.. దీనిలో 1,214 అడుగుల (370 మీటర్లు) మార్గాలను అన్వేషించారు. అదృష్టవశాత్తు అతను సజీవంగా తిరిగి వచ్చాడు కానీ.. దీని మూలాన్ని మాత్రం గుర్తించలేకపోయాడు. అయితే అతడికి ఆ బావిలో ఎలాంటి పాములు, చేపలు, అతీంద్రియశక్తులు కనిపించలేదట. కానీ లోపల మార్గం మాత్రం.. ఎంతటి తెలివైన వారినైనా తికమక పెట్టేలానే ఉందట. ఏది ఏమైనా ఈ జలాశయం ఎక్కడ పుట్టింది.. దీని లోతెంత? ఇందులో నిరంతరం నీరు ఎలా ఊరుతోంది? వంటి సందేహాలు తేలకపోవడంతో ఇది.. మిస్టీరియస్‌గానే మిగిలిపోయాయి. — సంహిత నిమ్మన ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
భారతదేశంలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు
-
ప్రపంచంలోని టాప్ 10 చారిత్రక ప్రదేశాలు (ఫోటోలు)
-
తవ్వి తలకు పోసుకుందామా?
పిచ్చి కుదిరింది... తలకు రోకలి చుట్టమన్నాడట! చరిత్ర పేరుచెప్పి, దేశంలో ప్రతి ఊరి పేరు, వీధి పేరు, స్థలం పేరూ మార్చేయాలని చూస్తున్న వేలంవెర్రిని గమనిస్తే, ఆ నానుడి గుర్తుకొస్తుంది. సర్వోన్నత న్యాయస్థానానికి సైతం అదే గుర్తొచ్చింది. ఆ మాటనే పస లేని పిటిషన్‌తో వచ్చిన ఫిర్యాదీతో సహా పదుగురికీ మరో పద్ధతిలో గుర్తూ చేసింది. ‘ఆటవిక విదేశీ దురాక్రమణదారులు మార్చిన’ చారిత్రక ప్రదేశాల ‘అసలు’ పేర్లను పునరుద్ధరించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ బీజేపీ నేత అశ్వినీ ఉపాధ్యాయ్ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సోమవారం సుప్రీమ్ కోర్ట్ కొట్టేసింది. జస్టిస్ జోసెఫ్, నాగరత్నల ధర్మాసనం పిటిషనర్ అత్యు త్సాహాన్ని తప్పుబట్టింది. భారత్ పదేపదే దాడులకు గురైంది నిజమే. విదేశీయులు మనల్ని పాలించినదీ నిజమే. దాన్ని గుర్తిస్తూనే, ‘సమాజంలో విభేదాల’ సృష్టికి ‘చరిత్రను కొంతమేరకే తవ్వి తలకుపోస్తున్న’ ప్రయత్నాలను సుప్రీమ్ నిరసించడం సరైన సమయంలో వెలువడింది. చరిత్ర పట్ల ఏదో నిర్ణీత దృక్పథం పెట్టుకొని, తదనుగుణంగా ప్రజాస్వామ్య, లౌకిక, గణతంత్ర దేశాన్ని గత చరిత్రలో బందీని చేయరాదంటూ పిటిషనర్‌కు కోర్ట్ హితవు చెప్పాల్సి వచ్చింది. వర్తమాన భారతావనిలో పరిష్కరించాల్సిన అనేక అంశాలుండగా, ఈ పేర్ల మార్పిడినే అజెండాగా పాలకులు, వారి భావజాల దాసులు తలకెత్తుకోవడం విచిత్రం. తాజాగా మహారాష్ట్రలో మొఘల్ పాలకులు ఔరంగజేబ్, మీర్ ఉస్మాన్ అలీఖాన్ పేర్ల మీద వెలసిన నగరాలైన ఔరంగాబాద్‌ను ఛత్రపతి శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధారాశివ్‌గా ఆ రాష్ట్ర పాలకులు మార్చేశారు. గత వారమే కేంద్రం దానికి రాజముద్రా వేసింది. ఇప్పుడిక అహ్మద్‌నగర్‌ను రాణి అహిల్యాదేవి హోల్కర్ పేరిట మార్చాలన్న డిమాండ్ ఊపందుకుంది. సరిగ్గా అదే రోజున పేర్ల మార్పిడిపై సుప్రీమ్ చేసిన ఈ వ్యాఖ్యలు కళ్ళు తెరిపించేలా ఉన్నాయి. ఆత్మశోధనకు ప్రేరేపిస్తున్నాయి. పేరులో ఏముంది పెన్నిధి అన్నారు పెద్దలు. కానీ, పేరులోనే అంతా ఉంది, ఒక వర్గం పాల కులు వచ్చి మన పేర్లు మార్చేశారంటూ రాగద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రచారం చేయడం నేటి వికృత ధోరణి. పాత పేర్లను మార్చడం ద్వారా సమాజంలో ఒక వర్గం ఏకీకృతమై, తమ వైపు మొగ్గేలా చేసుకోవాలన్న వ్యూహం దేశ రాజకీయాల్లో ఇటీవల ప్రబలుతోంది. ఇది ప్రమాదకరం. ఈ నేపథ్యంలో ‘నేను క్రైస్తవుణ్ణి. అయితేనేం, నాకు హిందూయిజమూ ఇష్టం. ఎంతో గొప్పదైన హిందూ ధర్మాన్ని తక్కువ చేయకూడదు’ అని జస్టిస్ జోసెఫ్ వ్యాఖ్యానించడం విశేషం. మన దేశానికి పునాదులుగా నిలిచిన సహనం, సౌభ్రాతృత్వం, భిన్నత్వం, సమ్మిళితత్వాలకు ఒక రకంగా ఇది పునరుద్ఘాటన. భిన్నత్వంలో ఏకత్వానికి ఘనత వహించిన గడ్డపై ఒక విధమైన భావజాలమే ఉండాలనీ, ఈ దేశాన్ని పాలించిన విభిన్న వర్గీయులంతా వట్టి ‘దురాక్రమణదారులు, విదేశీ దోపిడీదారులు’ అనీ ప్రచారం చేస్తే మూర్ఖత్వమే. అన్ని పేర్లూ మార్చి, అన్ని ముఖాలకూ సున్నం కొట్టి ఒకే ఉనికిని ధ్రువపరచాలనుకోవడం సాంస్కృతిక, భావజాల సామ్రాజ్యవాదమే తప్ప సమానత్వం కానేరదు. గద్దె మీది పెద్దలైనా, సమాజంలోని ఇతరులైనా ఈ ఉన్మాదాన్ని పెంచిపోషిస్తే, సామరస్యం దెబ్బతింటుంది. ఎవరైనా చేయాల్సింది మెరుగైన ప్రజాజీవనానికి తోడ్పడేలా విధానపరమైన మార్పులు తప్ప, ఒకరిపై మరొకరిని ఉసిగొలిపే పేరు మార్పులు కాదు. పాత గాయాలను కెలికి, ప్రజల్లో విభేదాలు సృష్టించే ఇలాంటి చర్యలను న్యాయవ్యవస్థే కాదు... బుద్ధిజీవులతో పాటు రాజకీయ సారథులూ నిర్ద్వంద్వంగా ఖండించాలి. అయితే, అధికారం చేపట్టిన ప్రతి పార్టీ ఇదే పేర్ల మార్పిడి తప్పు చేస్తోంది. గతంలో కాంగ్రెస్ దేశ రాజధానిలోని ప్రసిద్ధ కన్నాట్ ప్లేస్‌ను రాజీవ్ చౌక్‌గా, కన్నాట్ సర్కిల్‌ను ఇందిరా చౌక్‌గా పేర్లు మార్చింది. రెండు తడవలుగా కేంద్రంలో చక్రం తిప్పుతున్న బీజేపీ గడచిన కొన్ని నెలల్లో ఎన్ని పేర్లు మార్చిందో లెక్కే లేదు. బ్రిటీషు, మొఘల్ పాలకుల గతాన్ని వదిలించుకోవడానికంటూ కొత్త పేర్ల కథను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వర్తమానమే వివాదాలమయం అయినప్పుడు గతం అందుకు భిన్నంగా ఉండే అవకాశం లేదు. వివాదాలు నిండిన ఆ గతాన్ని పట్టుకొని వేలాడి, ఆగతాన్ని వదిలేసి, నవ నామ్నీకరణలకు దిగితే... కాలహరణమే తప్ప ప్రజానీకానికి పైసా ప్రయోజనం లేదు. దాని బదులు పాలనపై శ్రద్ధపెట్టి, అందమైన భవిష్యత్తు దిశగా అడుగులు వేయడం ఇప్పుడు ముఖ్యం. ప్రస్తుత పాలకులు రాజ్‌పథ్‌ను కర్తవ్యపథ్ అన్నా, మొఘల్ గార్డెన్స్‌ను అమృతోద్యానంగా మార్చినా, ఢిల్లీలోని ఔరంగ్జేబ్ రోడ్, యూపీలోని అలహాబాద్, మొఘల్ సరాయ్లకు కొత్త పేర్లు పెట్టినా సామాన్యుల జీవితమేమైనా మారిందా? చరిత్రను భూతంగా, ఒక వర్గం పాలకులనంతా పీడకులుగా, హిందువులు తప్ప మిగతా అందరూ ‘బయటివాళ్ళు’, ‘దోపిడీదొంగలు’గా అసత్య చిత్రణ వల్ల లాభం ఎవరికి? ఈ మిడిమిడి వాట్సప్ జ్ఞానంతో, మధ్యతరగతిని రెచ్చగొట్టే భావోద్వేగ రాజకీయ విన్యాసంతో ఓట్లు, సీట్ల లెక్కల్లో తాత్కాలిక ప్రయోజనం సిద్ధించవచ్చు. కానీ, స్వార్థంతో నాటుతున్న నేటి ఈ విషబీజాలు రేపటి సమాజాన్ని చీలుస్తుంటే ఆ శాశ్వత ప్రమాదానికి బాధ్యు లెవరు? కులమత విభేదాలకు అతీతమైన నవ భారత నిర్మాణాన్ని నిజంగా స్వప్నించేవారెవరూ ఈ పని చేయరు. పాలకుల స్వప్రయోజనాలతో రోజుకో రకం చరిత్ర చదివితే, అసలు కథ మరుగునపడే దుఃస్థితి దేశానికి దాపురిస్తుంది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడడమంటే ఇదే! -
Hyderabad: చారిత్రక సంపదకు నయా నగిషీలు
సాక్షి, హైదరాబాద్: చారిత్రక, సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. నిజాం హయాంలో నిర్మించిన ఆనేక కట్టడాలకు నగిషీలు చెక్కడం ద్వారా భావితరాలకు చారిత్రక వైభవాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ఆయా కట్టడాలను పునరుద్ధరిస్తోంది. ఇప్పటికే మొజంజాహీ మార్కెట్, క్లాక్‌టవర్లు, బన్సీలాల్‌పేట బావిని పునరుద్ధరించిన పురపాలక శాఖ.. తాజాగా ముర్గీ చౌక్, మీరాలం మండి, సర్దార్ మహల్‌లకు నయా సొబగులను అద్దాలని నిర్ణయించింది. అంతర్జాతీయ పర్యాటక స్థలాల్లో ఒక్కటిగా చెప్పుకునే చార్మినార్, దాని పరిసరాలను అందంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ మూడింటిని పునరుద్ధరించే పనులను చకచకా చేస్తోంది. కులీ కుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ వీటిని పర్యవేక్షిస్తోంది. వడివడిగా మీరాలంమండి పనులు నగర ప్రజల కూరగాయ అవసరాలను తీర్చడానికి 1805లో అప్పటి ప్రధాని నవాబ్ మీర్ అలం యార్జంగ్ మీరాలం మండిని ప్రారంభించారు. హైదరాబాద్ తొలి మార్కెట్‌గా చెప్పుకొనే ఈ మండి.. ప్రస్తుతం కూడా కొనసాగుతున్నప్పటికీ దయనీయ పరిస్థితిలో ఉంది. కనీస సౌకర్యాల్లేక.. సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.16.45 కోట్లను కేటాయించారు. మార్కెట్‌ను మూడు విభాగాలు విభజించి.. దశలవారీగా అభివృద్ధి చేయనున్నారు. సర్దార్ మహల్ పునరుద్ధరణ.. 1900లో యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించిన సర్దార్ మహల్ చారిత్రక కట్టడం. నిర్వహణ లేక భవనం పూర్తిగా దెబ్బతిన్నది. పూర్వ వైభవం తేవడానికి జీహెచ్ఎంసీ ప్రత్యేక నిధులను కేటాయించి పనులను ‘కుడా’ ఆధ్వర్యంలో ప్రారంభించనుంది. భవనం శైలి దెబ్బ తినకుండా ఆధునికీకరించనున్నారు. ఈ భవనంలో సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించిన పురపాలకశాఖ.. అభివృద్ధి పనులకు రూ.30 కోట్లు కేటాయించింది. చదవండి: ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన వైద్యురాలు.. పసికందు మృతి శిథిలావస్థలో ముర్గీచౌక్.. 125 ఏళ్ల చరిత్ర కలిగిన కోళ్ల మండి (ముర్గీ చౌక్)ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీ హయాంలో ఏర్పడింది. చికెన్‌తో పాటు మాంసాన్ని సైతం ఇక్కడ విక్రయించేలా మార్కెట్‌ను అభివృద్ధి చేశారు. కాల గమనంలో ఈ మండి శిథిలావస్థకు చేరింది. పురాతన కట్టడాలు పెచ్చులు ఊడిపోయి, రేకుల షెడ్డు ఎగిరిపోవడంతో ముర్గీచౌక్ అధ్వానంగా తయారైంది. ఈ మార్కెట్‌ను ఆధునికీకరించాలని ‘కుడా’ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రూ.36 కోట్ల నిధులను విడుదల చేసింది. గ్రౌండ్ ప్లస్ భవనాన్ని నిర్మించాలని, దిగువన మార్కెట్.. పై అంతస్తులో రెస్టారెంట్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్కెట్‌ను అక్కడి నుంచి సమీపంలోని మైదానంలోకి షిఫ్ట్ చేసింది. దీన్ని ఏడాదిన్నరలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. పూర్వ వైభవం తెస్తాం.. నిజాం పాలన హయాంలో నిర్మించిన కట్టడాలకు పూర్వ వైభవం తేవడానికి ప్రణాళిక రూపొంచింది. చారిత్రక కట్టడాల వారసత్వ సంపద పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. నిపుణుల సలహాలు, సూచనలతో ఆధునికీకరణ పనులు చేపడుతున్నాం. తొలుత ముర్గీచౌక్ నిర్మాణ పనులు ప్రారంభించాం. మీరాలంమండి, సర్దార్ మహల్ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. – బాదావత్ సంతోష్, కుడా అడ్మినిస్ట్రేటర్ గడువులోగా పనులు పూర్తి చేస్తాం.. ముర్గీచౌక్ మార్కెట్ పనులు ప్రాంభమయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న మార్కెట్లోని వ్యాపారులను సమీప మైదానంలోకి తరలించాం. టెండర్ ప్రక్రియ ద్వారా పనులను కేటాయించాం. ఉన్నత అధికారుల ఆదేశాలు.. ప్లాన్ ప్రకారం పనులు అయ్యే విధంగా ప్రణాళికాబద్ధంగా పనులు చేయిస్తున్నాం. నిర్మాణాలు గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించాం. – జి.గురువీర, కుడా సెక్రటరీ, చీఫ్ ఇంజినీర్ చదవండి: తెలంగాణ ఆర్టీసీ బస్సులు డొక్కుడొక్కు.. అద్దె బస్సులపై కన్ను? -
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
-
కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకీ విలయతాండవం చేస్తుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మాహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్రంలోని సీనియర్ అధికారులు ప్రకటించారు. గతేడాది కరోనా విశ్వరూపం చూపిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. కొన్ని రోజుల తరువాత వైరస్ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా అమలు చేస్తున్నాయి. ( చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు ) -
తారామతి, ప్రేమామతి సమాధులకు కొత్తందాలు
సాక్షి, హైదరాబాద్: తారామతి, ప్రేమామతి సమాధులు కొత్తందాలను సంతరించుకున్నాయి. పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిగేల్మంటున్నాయి. లక్షా మూడు వేల యూఎస్ డాలర్లతో సుందరీకరించిన ఈ రెండు సమాధులను భారత్ లోని యూఎస్ అంబాసిడర్ కెన్నెత్ ఐ జస్టర్ చేతు ల మీదుగా మంగళవారం పర్యాటకులకు అంకి తం చేశారు. ఈ సందర్భంగా జస్టర్ మాట్లాడు తూ.. ఆగాఖాన్ ట్రస్టు ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో 17వ శతాబ్దపు కులీకుతుబ్‌షాహీ రాజుల సమాధుల సుందరీకరణ పనులకు తమ ప్రభు త్వం ఏటా నిధులు కేటాయిస్తోందన్నారు. ప్రపంచం లోని చారిత్రక కట్టడాలను వారసత్వ సంపదగా భావితరాలకు అందించడానికే ఈ సాయం చేస్తున్నామన్నారు. ‘గతంలోనూ ఆగాఖాన్ ఫౌండేషన్‌కు లక్షా ఒక వేయి డాలర్లను ఇచ్చాం. సుందరీకరణ పనులు ఊహించిన దానికంటే గొప్పగా జరుగుతున్నాయి’అని ఆయన ప్రశంసించారు. కుతుబ్‌షాహీ సమాధుల సుందరీకరణ పను లు కూడా పూర్తయితే ఇక్కడ ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతం రూపుదిద్దుకుంటుందన్నారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర పురాతత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నారాయణ, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సీఈవో రితీష్‌నంద, సైట్ అధికారి గణేష్‌రెడ్డి తదితరులున్నారు. వెన్నెల రాత్రుల్లో అక్కాచెల్లెళ్ల నృత్యం అక్కాచెల్లెళ్లయిన తారామతి, ప్రేమామతి.. చివరి కుతుబ్‌షాహీ సుల్తాన్ ఆస్థానంలో నృత్యకారిణులు. మంచి అభినయంతో, అందమైన గాత్రాలతో వినసొంపుగా పాడేవారు. ఇవి రాజులను మంత్రముగ్ధులను చేసేవి. వీరి ఆటపాటలకు వీలుగా తారామతి బారాదరిలో నృత్య వేదికలను నిర్మించారు. బారాదరి.. రెండంతస్తులతో, చదరపు ఆకారంలో అన్నివైపులా బలమైన తోరణాలతో, చక్కని శబ్దగ్రాహ్యతతో కూడిన విలక్షణమైన నిర్మాణం. గోల్కొండ కోటకు సమీపంలోనే ఇది ఉంది. నృత్య ప్రదర్శనల సందర్భంలో బారాదరి – గోల్కొండ కోటను కలుపుతూ తీగలను అనుసంధానించే వారు. వాటిపై తారామతి, ప్రేమామతి వెన్నెల రాత్రుల్లో నృత్యాలు చేసేవారని చరిత్రకారులు చెబుతారు. మరణానంతరం వీరిద్దరిని ఇబ్రహీంబాగ్‌లోని కుతుబ్‌షాహీల రాజ శ్మశానవాటికలో ఖననం చేశారు. ఈ రెండు సమాధులు పక్కపక్కనే ఉంటాయి. ప్రస్తుతం వీటినే సుందరీకరించి, పర్యాటకుల సందర్శనకు వీలుగా అంకితం చేశారు. -
‘నిర్లక్ష్యం తగదు’
బంజారాహిల్స్: చారిత్రక ప్రదేశాలపై నిర్లక్ష్యం తగదని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయం వెనకాల ఉన్న ఓ పురాతన భవనం ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. 1922లో నిర్మించిన ఈ భవనం గత 40 ఏళ్లుగా ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సంబంధిత అధికారులు ఈ భవనాన్ని గుర్తించి దీన్ని లైమ్‌లైట్‌లోకి తీసుకురావాలని వీటి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. -
చారిత్రక విశేషాల ‘కొండ’
నెల్లిమర్ల పట్టణాన్ని అనుకుని ఉన్న ఆ కొండ చారిత్రక విశేషాలకు నిలయం. కొండపై ఎప్పుడో నాలుగు శతాబ్దాల కిందట విజయనగరం సామ్రాజ్యానికి చెందిన రాజులు నిర్మించిన కోట దర్శనమిస్తుంది. అప్పట్లో విజయనగరం ప్రభువుతో పాటు పరివారమంతా కొండెక్కి ఆ కోటలో విడిది చేసేవారు. కొండపై చిన్న కొలను కూడా ఉంది. వేసవిలోనూ ఆ కొలనులో నీరుండటం విశేషం. ఇదీ నెల్లిమర్ల పట్టణం – కొండవెలగాడ గ్రామాల మధ్యనున్న వెలగాడ కొండ ప్రత్యేకత. దీనికి సంబంధించి ఆనాటి వృద్ధులు చెబుతున్న వివరాల్లోకి వెళ్తే.. నెల్లిమర్ల : విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించిన పూసపాటి గజపతుల వంశానికి చెందిన మహరాజులు వెలగాడ కొండపై విడిది ఏర్పాటు చేసుకున్నట్టు స్థానికులు చెబుతారు. దీనిలో భాగంగానే కొండపైన కోట నిర్మించుకున్నారు. గుర్రాలు, ఏనుగులు ఎక్కి తమ పరివారంతో కొండనెక్కేవారు. దీని కోసం అప్పట్లో ప్రత్యేకంగా రహదారి ఉండేది. ముందుగా నెల్లిమర్ల పట్టణంలోని ప్రస్తుతం చంద్రబాబు కాలనీ ఉన్న ప్రాంతానికి విచ్చేసేవారు. ఇక్కడ కొంతసేపు సేద తీర్చుకుని, కొండ ఎక్కేవారు. గుర్రాలు, ఏనుగులు నీరు తాగేందుకు అప్పట్లో ఈ ప్రాంతంలో చిన్నపాటి కొలను తవ్వించారు. ఆ కొలను ఇప్పటికీ ఈ ప్రాంతంలో ఉంది. రాజులు కొండనెక్కే రహదారి మాత్రం కాలక్రమేణా కనుమరుగైంది. పెద్దపెద్ద చెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయింది. కోటకు సమీపంలోనే గుర్రాలు, ఏనుగుల కోసం షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. కోట శిథిలమైనా గోడలు మాత్రం చెక్కు చెదరలేదు. పైకప్పు పోయినా కోట ఆకారం మాత్రం కనిపిస్తుంది. కోటకు సమీపంలోనే రైల్వే విభాగానికి సంబంధించిన సిగ్నల్ బోర్డు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉండే రైళ్లకు సైతం ఈ బోర్డు కనిపిస్తుంది. ఈ కొండపైన చిన్నపాటి కొలను ఉంది. మండు వేసవిలోనూ ఈ కొలనులో నీరు ఉంటుంది. గతంలో సమీప గ్రామాల ప్రజలు ఈ కొలనులో స్నానాలు చేసేవారు. కొండపై నుంచి చూస్తే నెల్లిమర్ల, విజయనగరం పట్టణాలతో పాటు 30 కిలోమేటర్ల మేర అన్ని గ్రామాలు, ప్రాంతాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతం స్పష్టంగా కనిపిస్తుంది. కొండపైన ఇప్పటికీ పుట్ట తేనె విరివిగా లభ్యమవుతుంది. స్వచ్ఛమైన పుట్ట తేనెను స్థానికులు కొండపైకెక్కి తెచ్చుకుంటారు. దారి తప్పితే ఇబ్బందే.. కొండెక్కేవారు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. రిజర్వ్ ఫారెస్ట్ ఆధీనంలో ఉండటం వల్ల ప్రస్తుతం పెద్దపెద్ద చెట్లు, ముళ్లపొదలు పెరిగాయి. ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఒక అంచనా పెట్టుకోవాలి. అలాగైతే కొండ ఎక్కేందుకు గంటన్నర నుంచి రెండుగంటల సమయం పడుతుంది. దారి తప్పితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొండ పైకి వెళ్లేవారు తమవెంట తప్పనిసరిగా గొడుగు, టవల్, తాగునీరు, ఆహారం తీసుకెళ్లాలి. థ్రిల్లింగ్‌గా ఉంది... ఇటీవల మా స్నేహితులతో కలిసి వెలగాడ కొండ ఎక్కాను. ఎక్కేటప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించినా కొండపైకి వెళ్లిన తరువాత చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. కొండపైన విజయనగరం రాజులు నిర్మింంచిన కోట, రైల్వేసిగ్నల్ బోర్డు ఉన్నాయి. అక్కడి నుంచి చూస్తే విజయనగరం, నెల్లిమర్ల పట్టణాలతో పాటు చాలా గ్రామాలు కనిపించాయి. –పెనుమత్స గణేశ్ వర్మ, ఏఓ, మిమ్స్ ఆసుపత్రి చిన్నతనంలో ఆడుకునే వాళ్లం... మాది కొండవెలగాడ గ్రామం. మా గ్రామాన్ని ఆనుకునే వెలగాడ కొండ ఉంది. మా చిన్నతనంలో ప్రతి రోజు కొండపైకి వెళ్లేవాళ్లం. అక్కడున్న కోటలో ఆటలాడుకునేవాళ్లం. కొండపైనున్న కొలనులో ఈత కొట్టేవాళ్లం. మండు వేసవిలో కూడా కొండపైన వాతావరణం చల్లగా ఉంటుంది. ప్రభుత్వం కల్పించుకుని పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ప్రయోజనముంటుంది. –దంతులూరి గిరిరాజ్, కొండవెలగాడ -
చరిత్రాత్మక ప్రాంతంగా మన్యం వీరుడి సమాధి
గొలుగొండ(నర్సీపట్నం): స్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, గంటందొర సమాధులను చరిత్రాత్మక ప్రాంతాలుగా బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధుల వద్ద మ్యూజియం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. రాష్ట్ర పరిపాలనా విభాగం కార్యదర్శి(ఇన్చార్జి) శ్రీకాంత్ నాగులపల్లి నుంచి ఆదేశాలు అందాయి. అల్లూరి పోరా టాలు, ఆయన సంచరించిన ప్రాంతాలపై 2011లో పురావస్తుశాఖ అధ్యయనం చేసింది. అయితే అప్పటిలో కచ్చితమైన సమాచారం లేకపోవడంతో చరిత్రాత్మక ప్రాంతంగా గుర్తించేకపోయారు. తరువాత మళ్లీ అధ్యయనం చేసి, ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అల్లూరి, గంటందొర పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించిన ప్రాంతాలు, కృష్ణదేవిపేటలోని సర్వే నంబర్ 120–3–బిలో , 129– 3లో 1.28 ఎకరాల్లో మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. -
వలంధరుల గుర్తుగా.. వలంధరరేవు
నరసాపురం : సాధారణంగా పుష్కరఘాట్లకు పురాణ నేపథ్యం ఉంటుంది. నరసాపురం వలంధరరేవు మాత్రం చారిత్రక నేపథ్యం ఉండటం విశేషం. డచ్, బ్రిటీష్ వారి హయాంలో ఈ రేవు ఓడలరేవుగా విరాజిల్లింది. ఈ రేవు నుంచి చిన్నచిన్న ఓడలపై సరుకులను సముద్రంలో పెద్ద ఓడలపైకి చేర్చేవారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్, హాలెండ్ దేశాలకు చెందిన వారు ఈ రేవులోకి దిగేవారు. స్థానికులు వారిని వలంధరులుగా పిలిచేవారు. వలంధరులు వచ్చి, వెళ్లే రేవు క్రమంగా వలంధరరేవుగా మారిపోయింది. -
వలంధరుల గుర్తుగా.. వలంధరరేవు
నరసాపురం : సాధారణంగా పుష్కరఘాట్లకు పురాణ నేపథ్యం ఉంటుంది. నరసాపురం వలంధరరేవు మాత్రం చారిత్రక నేపథ్యం ఉండటం విశేషం. డచ్, బ్రిటీష్ వారి హయాంలో ఈ రేవు ఓడలరేవుగా విరాజిల్లింది. ఈ రేవు నుంచి చిన్నచిన్న ఓడలపై సరుకులను సముద్రంలో పెద్ద ఓడలపైకి చేర్చేవారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్, హాలెండ్ దేశాలకు చెందిన వారు ఈ రేవులోకి దిగేవారు. స్థానికులు వారిని వలంధరులుగా పిలిచేవారు. వలంధరులు వచ్చి, వెళ్లే రేవు క్రమంగా వలంధరరేవుగా మారిపోయింది. -
మహాబలిపురానికి మహర్దశ
చెన్నై: తమిళనాడులోని అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచి చారిత్రాత్మక నేపధ్యం కలిగిన మహాబలిపురానికి మహర్దశ పట్టనుంది. సముద్రతీరంలో వెలిసిన మహాబలిపురంలోని ప్రకృతి రమణీయ దృశ్యాలకు ప్రపంచస్థాయి గుర్తింపురానుంది. బండరాళ్లపై చెక్కిన అద్భుత శిల్ప సౌందర్యానికి అందలమంతటి గౌరవం దక్కనుంది. చెన్నైకి దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహాబలిపురం కాంచీపురం జిల్లా పరిధిలో ఉంది. ఒకప్పుడు మామల్లపురంగా ఉండి క్రమేణా మహాబలిపురంగా మారింది. భారతీయులు తమ వర్తక, వాణిజ్య కార్యకలాపాలకు ఇక్కడి సముద్రమార్గం గుండా వెళ్లేవారు. 7వ దశాబ్దంలో దక్షిణభారతదేశాన్ని ఏలిన ప్రముఖ మహారాజులైన పల్లవులు మహాబలిపురాన్ని నిర్మించనట్లు చరిత్ర చెబుతోంది. ఎంతో కళాత్మక దృష్టి కలిగిన పల్లవరాజులు ఎందుకూ పనికిరాని బండరాళ్ల నుండి అధ్బుత శిల్ప సౌందర్యాన్ని వెలికితీసారు. నృత్యభంగిమలు, ఏనుగులు, గుహలు, ఆలయ గోపురాలు ఇలా వేలాదిగా శిల్ప సౌందర్యం పల్లవరాజుల కళాతృష్టకు అద్దం పడుతుంది. ఒక బ్రిటీష్ రాజు ఇక్కడి ప్రాచీన శిల్పసౌందర్యాలకు 1827లో మరింతగా మెరుగులు దిద్దారని తెలుస్తోంది. ప్రస్తుత 21 వ శతాబ్దంలోనూ ఇక్కడికి చేరుకునే సందర్శకులను అబ్బురపరుస్తోంది. సముద్ర తీరంలో ఉండటం వల్ల అక్కడి అలల ఘోష శ్రావ్యమైన సంగీతంగా మారిపోతుంది. విదేశాల నుండి వచ్చే పర్యాటకుల్లో అధికశాతం మహాబలిపురాన్ని సందర్శించకుండా వెళ్లరు. విదేశీయులు ఇక్కడి హోటళ్ల రోజుల కొద్దీ బసచేసి మహాబలిపురం ఆందాలను తమ కెమారాల్లో బంధిస్తుంటారు. దేశ విదేశాల నుండి వచ్చే పర్యాటకులతో మహాబలిపురం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటుంది.ప్రపంచంలోని అతిముఖ్యమైన హెరిటేజ్ ప్రాంతంగా మహాబలిపురాన్ని యునెస్కో చేర్చింది. ప్రపంచ ప్రజలను ఆకర్షించేస్థాయిలో మెచ్చదగిన పర్యాటక ప్రదేశంగా యునెస్కో గుర్తించింది. అంతేగాక దీనికి మరింత మెరుగులు దిద్ది అంతర్జాతీయ ఖ్యాతిని దక్కించేందుకు సిద్దం అయింది. శిల్పకళా సౌందర్యం వెల్లివిరిసే ప్రాంతాలను గుర్తించేందుకు చైనా, బంగ్లాదేశ్, కువైట్ దేశాలను పర్యటించిన యునెస్కో లోని 8 మంది సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి బృందం ఇటీవల భారత్‌కు వచ్చిన సమయంలో మహాబలిపురాన్ని సంద ర్శించింది. ఒక ప్రయివేటు సంస్థకు చెందిన థియేటర్లో మహాబలిపురంపై చిత్రీకరించిన త్రీడీ యానిమేషన్ చిత్రాన్ని తిలకించింది.