కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత | Monuments Under Central Government Closed Till May 15 Covid Spike | Sakshi
Sakshi News home page

కేంద్రం కీలక నిర్ణయం.. ఆ ప్రాంతాలన్నీ మూసివేత

Published Fri, Apr 16 2021 12:21 PM | Last Updated on Fri, Apr 16 2021 3:52 PM

Monuments Under Central Government Closed Till May 15 Covid Spike - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి రోజురోజుకీ విలయతాండవం చేస్తుండటంతో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మాహమ్మారిని కట్టడి చేసే పనిలో భాగంగా దేశ వ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలు, స్మారక స్థలాలు, మ్యూజియాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వ సంరక్షణలో ఉండే స్మారక కట్టడాలు, స్థలాలు, మ్యూజియాలను మే 15వరకు మూసివేస్తున్నట్టు కేంద్రంలోని సీనియర్‌ అధికారులు ప్రకటించారు. గతేడాది కరోనా విశ్వరూపం చూపిన సందర్భంలో కూడా ఈ కట్టడాలన్నీ మూసివేయగా.. కొన్ని రోజుల తరువాత వైరస్‌ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలు ఎత్తివేసిన విషయం తెలిసిందే. తాజాగా గతంలో కంటే వేగంగా కరోనా 2.0 కమ్ముకొస్తోంది. బుధవారం ఒక్కరోజే 2 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్‌ను అదుపు చేసే చర్యల్లో భాగంగా మరోసారి కేంద్రం సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలను దశల వారీగా అమలు చేస్తున్నాయి.

( చదవండి: కోవిడ్-19 ఎఫెక్ట్ మహారాష్ట్రలో కిక్కిరిసిన రైల్వే స్టేషన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement