
బంజారాహిల్స్: చారిత్రక ప్రదేశాలపై నిర్లక్ష్యం తగదని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ట్వీట్ చేశారు. బంజారాహిల్స్‌లోని షేక్‌పేట మండల కార్యాలయం వెనకాల ఉన్న ఓ పురాతన భవనం ఫొటోలను ఆయన ట్వీట్ చేశారు. 1922లో నిర్మించిన ఈ భవనం గత 40 ఏళ్లుగా ఎవరూ లేకపోవడంతో శిథిలావస్థకు చేరింది. సంబంధిత అధికారులు ఈ భవనాన్ని గుర్తించి దీన్ని లైమ్‌లైట్‌లోకి తీసుకురావాలని వీటి పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment